Guntur

News June 25, 2024

అమెరికాలో గోపికృష్ణను కాల్చి చంపిన నిందితుడు అరెస్టు

image

అమెరికాలోని డల్లాస్‌లో బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ (32)ని ఓ దుండగుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దుండగుడు మాథిసిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతనిపై అభియోగాలు నమోదు చేశామని, గతంలో కూడా హత్యానేరం ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గోపికృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు.

News June 25, 2024

జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

image

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.

News June 25, 2024

గుంటూరు జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు AP పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 501 ఎస్టీటీలతో కలిపి మొత్తం 1159 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

ప్రయాణికుల రద్దీతో గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకు సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రత్యేక రైలు (07445) కాకినాడలో 20.10 గంటలకు బయలుదేరి విజయవాడ 00.50, గుంటూరు 01.40, సత్తెనపల్లి 02.23, పిడుగురాళ్ల 02.47, సికింద్రాబాద్ 07.15 గంటలకు చేరుతుందన్నారు.

News June 25, 2024

కాకుమాను: వివాహిత ఫోన్‌కు సందేశాలు పంపిన వీఆర్వోపై కేసు

image

ఓ మహిళ ఫోన్ ‌కు సందేశాలు పంపిన వీఆర్వోపై కేసు నమోదైంది. కాకుమాను ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గార్లపాడు సచివాలయంలో విధులు నిర్వర్తించే వీఆర్వో వద్దకు 10 రోజుల కిందట ఓ వివాహిత తన కుమారుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో తన ఫోన్ నంబరు తీసుకొని, అప్పటి నుంచి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు మహిళ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News June 24, 2024

ఇక ప్రతి సోమవారం ప్రజా సమస్యల స్వీకరణ: నిర్మల్ కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం సోమవారం నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ సందర్బంగా నిలిపివేసిన స్పందన కార్యక్రమం మళ్లీ ప్రారంభించామని ప్రతి సోమవారం కార్పోరేషన్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

News June 24, 2024

గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజకుమారి

image

గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఎం. వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో ఆయన స్థానంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగలక్ష్మిని నియమించారు. ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

News June 24, 2024

ఎంపీగా తెలుగులో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం

image

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం లోక్ సభలో ప్రమాణస్వీకారం చేశారు. మాతృభాష అయిన తెలుగులోనే ఆయన ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆయనతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఆయన అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో గుంటూరు జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

image

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.