India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. 4 నుంచి 5 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. అతిభారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలు పాటించి తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు సూచించారు.
గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్మిణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సమస్యని నితిన్ గట్కరీ దృష్టికి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పలుమార్లు తీసుకెళ్లారు. ఎన్నికల అనంతరం ఫ్లైఓవర్‌పై మున్సిపల్ అధికారులతో పెమ్మసాని అనేక రివ్యూలు చేపట్టారు. ఎట్టకేలకు పెమ్మసాని చొరవతో గుంటూరు నగర ప్రజల కల త్వరలో నెరవేరనుంది.
గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాలు నిర్వహించిన లాటరీలో భార్య భర్తలకు ఏకంగా ఆరు మద్యం దుకాణాలు లభించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరులో ఒక బారు నిర్వహిస్తున్న యజమాని తన అదృష్టాన్ని పరిశీలించుకోవటానికి తన భార్య పేరుతో కలిసి 40 దరఖాస్తులు చేశారు. వారికి జిల్లాలో ఆరు మద్యం దుకాణాలు లాటరీలో రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల బందోబస్తు మధ్య మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. 373 షాపులకు 9,191 దరఖాస్తులు వచ్చాయి. కాగా గుంటూరు జిల్లాలో 4 గంటల్లోనే లాటరీ ప్రక్రియ ముగియడం విశేషం. గుంటూరు జిల్లాలో 127 షాపులకు 11 మహిళలకు దక్కాయి. అటు బాపట్ల జిల్లాలో 117 దుకాణాలకు గాను 7, పల్నాడు జిల్లాలో 129 షాపులకు 7 చోట్ల మహిళలకు దక్కాయి. అత్యధికంగా మంగళగిరిలో 28 షాపులకు 6 మహిళలకే దక్కడం విశేషం.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
అక్టోబరు 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కొరకు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు 12 గంటలకు సచివాలయానికి వస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తీసుకువస్తున్న పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడి విడిగా సీఎం అధికారులతో చర్చిస్తారని కార్యాలయం తెలిపింది.
చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్లపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో కుళాయి వద్ద నీరు పడుతోంది. ఈ క్రమంలో 50ఏళ్ల వయసున్న భాగ్యారావు బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ జూనియర్ 57 కిలోలు విభాగంలో బంగారు పతకం సాధించారు. స్క్వాట్ -185 కిలోల బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 95 కిలోల బంగారు పతకం, డెడ్‌లిఫ్ట్ 180 కిలోలు బంగారు పతకం, ఓవర్ల్ 460 కిలోలు బంగారు పతకం, ఓవరాల్ గా నాలుగు బంగారు పతకాలు సాధించారు.
Sorry, no posts matched your criteria.