Guntur

News June 24, 2024

ANU: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్(BA, BCom, BCA, BAOL) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చంది.

News June 24, 2024

నరసరావుపేట: ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నరసరావుపేటలోని ఓ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం.. చందు అనే యువకుడు అదే ప్రాంతంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామీణ స్టేషన్ ఎస్సై రోశయ్య కేసు నమోదు చేశారు.

News June 24, 2024

నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

image

మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నారా లోకేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్ర క్యాబినెట్లో లోకేశ్‌కి స్థానం దక్కింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.45 గంటలకు వెలగపూడిలో ఉన్న రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన ఛాంబర్‌లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరించనున్నారు.

News June 23, 2024

విధుల నుంచి రిలీజ్ అయిన గుంటూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి చార్జీని అప్పగించారు. విజయనగరం జిల్లా నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఎస్.నాగలక్ష్మి బుధవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 23, 2024

బాపట్ల యువకుడు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం

image

అమెరికాలో బాపట్ల నియోజకవర్గానికి చెందిన యువకుడు దాసరి గోపికృష్ణ మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. యువకుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. దుండగుల దాడి ఘటనలో గోపికృష్ణ మృతి చెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News June 23, 2024

నాదెండ్ల మనోహర్‌ను కలిసిన మాజీ ఎంపీ జయదేవ్

image

తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆదివారం గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మనోహర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

News June 23, 2024

నీటి ఎద్దడి పరిష్కారమే లక్ష్యం: పెమ్మసాని

image

గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌లో పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గుంటూరు నగర అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులపై డీపీఆర్‌లను 30-45 రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు.

News June 23, 2024

మంగళగిరి: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

image

సముద్ర స్నానానికి వెళ్లి మంగళగిరి యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12మంది యువకులు ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ బీచ్‌లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

News June 23, 2024

అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి

image

అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి అమెరికాలో నివాసం ఉంటున్నారు. అయితే దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీ కృష్ణ అక్కడి కక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి మంత్రిగారు: నారా లోకేశ్

image

నిన్న జరిగిన శాసనసభ అనంతరం లాబీ వద్ద మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి వచ్చారు. దీంతో వారు ఇద్దరు పలకరించుకోని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. అనంతరం లోకేశ్ మంత్రిగారూ.. త్వరగా ఎయిర్ పోర్ట్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయనను అడిగారు. వెంటనే కేంద్ర మంత్రి రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పాగా.. రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి అని లోకేశ్ కోరారు.