India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.చరణ్, హాసిని ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధరరావు, కడియం జయరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరి ఎంపిక జరిగిందన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న 2023-24 విద్యా ఏడాది చివరి పనిదినం కావడంతో ఆరోజు వారిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను కొనసాగిస్తూ విధుల్లోకి తీసుకోవాలని జిల్లా సమన్వయకర్త, ప్రిన్సిపాల్స్‌ని ఆదేశించారు.
తెనాలి గాంధీనగర్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ బేగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతను తన సోదరుడితో పాటు ఆదిభట్ల ప్రాంతంలో రూములో ఉంటున్నాడు. సోమవారం ఉదయం వీళ్లిద్దరితో పాటు మరో యువకుడు బైకు మీద ఉద్యోగాలకు బయల్దేరారు. ఈ క్రమంలో మీర్‌పేట్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో హుస్సేన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు ఇస్మాయిల్ కోమాలోకి వెళ్లాడు.
ఈవీఎం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ కంట్రోల్ యూనిట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల సీరియల్ నంబర్ వారీగా ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు బాధ్యతగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని స్పష్టం చేశారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రతిరోజు పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావుపేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది.
ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ రోజు రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పల్నాడు కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ రావు, ఎస్పీ మలికా గర్గ్, జేసీ శ్యాంప్రసాద్, డీఆర్వో వినాయకం, తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కాలేజిల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్- 2024లో అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. గుంటూరు నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజి, నరసరావుపేట JNTUలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 1-12వేల ర్యాంకుల వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంబీటీఎస్ హెల్ప్ లైన్ సెంటర్లో 65 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 15 అసెంబ్లీ, 2 MP స్థానాలు గెలుచుకోగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం సరకుల రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ మండల రైల్వే అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ అధికారులను నియమించారు. సీనియర్ డీఈఎన్(కోఆర్డినేషన్), సీనియర్ డీఎస్వో, సీనియర్ డీఎంఈ, సీనియర్ డీఎంవో ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తమ నివేదికను జూన్ 2 లోపు ఇవ్వాలి. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సోమవారం గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాసరావుపేటలో లత అనే మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తోంది. సోమవారం సీఐ మధుసూదన్ రావు ఆ ఇంటిపై తనిఖీలు చేసి ఇద్దరు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.