Guntur

News June 21, 2024

హత్య ఘటనా స్థలిని పరిశీలించిన ఐజీ

image

బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో జరిగిన యువతి హత్య ఘటనా స్థలిని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి పరిశీలించారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలించి ఆధారాలను సేకరించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలించాలని సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News June 21, 2024

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

డయేరియా, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాల్లో, గ్రామాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

News June 21, 2024

గుంటూరు: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

image

స్నేహితులతో సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొక విద్యార్థి గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు శుక్రవారం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడి తీవ్రం కావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాసేపటికే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.

News June 21, 2024

బాపట్ల: హత్యా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి

image

ఈపురుపాలెం గ్రామంలో బహిర్భూమికి వెళ్లి హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు.

News June 21, 2024

సత్తెనపల్లి: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

మండలంలోని అబ్బూరు గ్రామంలో బ్రహ్మయ్య(47) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రహ్మయ్య ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశారు. అయితే పంట సరిగా పండకపోవడంతో సుమారు రూ.20 లక్షలు అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 21, 2024

గుంటూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ ప్రహరీ గోడ, రైల్వే పట్టాల ఎదురుగా చెట్ల మధ్య మృతదేహం పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ వకుల్ జిందాల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందిన యువతి సుచరిత(21)గా గుర్తించారు.

News June 21, 2024

గుంటూరు : శాసనసభకు ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

◆సీనియర్లు: ధూళిపాళ్ల నరేంద్ర (6వసారి)
◆యరపతినేని శ్రీనివాసరావు (4వసారి)
◆నాదెండ్ల మనోహర్ (3వసారి)
◆నక్కా ఆనంద్ బాబు (3వసారి)
◆అనగాని సత్యప్రసాద్(3వ సారి)
◆జీవీ ఆంజనేయులు (3వసారి)
◆తెనాలి శ్రావణ్ కుమార్ (2వసారి)
◆తొలిసారి: నారా లోకేశ్, మొహ్మద్ నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి
◆ బూర్ల రామాంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు
◆ భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, వేగేశన నరేంద్ర వర్మ

News June 21, 2024

నేడు అసెంబ్లీకి నారా లోకేశ్.. ఆయన హామీలివే.!

image

మంగళగిరి MLAగా నారా లోకేశ్ నేడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆయన హామీలివే..
◆మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు
◆ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు
◆నియోజకవర్గంలోని 20వేల మంది పేదలకు పక్కా ఇళ్లు
◆స్వర్ణ కార హబ్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
◆చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపునకు చర్యలు
◆మంగళగిరి, తాడేపల్లి వాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించడం.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి గల్లా మాధవి.. ఆమె హామీలివే.!

image

గుంటూరు వెస్ట్ MLAగా గల్లా మాధవి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆమె హామీలివే..
◆UGD పనులు పునఃప్రారంభం
◆హోటళ్లలో ఆహార కల్తీ నియంత్రణ
◆స్వచ్చ గుంటూరు సాకారానికి సులభ్ కాంప్లెక్సుల నిర్మాణం
◆ప్రీలెఫ్ట్‌తో పాటు పార్కులు అభివృద్ధి
◆కుక్కల బెడదపై చర్యలు
◆రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
◆గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై ఉక్కుపాదం
◆శ్యామల నగర్ RUB, శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి.

News June 21, 2024

నేడు గుంటూరుకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని

image

కేంద్ర సహాయమంత్రిగా భాద్యతలు స్వీకరించిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు తొలిసారి గుంటూరుకు రానున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టోల్ ప్లాజా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు, కార్యకర్తలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం.. శ్రీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు.