India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయపురిసౌత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 17న పురిటి బిడ్డతోపాటు తల్లి పావని మృతి చెందిన ఘటనపై, సమగ్ర విచారణతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఆరోగ్య సేవల కో-ఆర్డినేటర్ (DCHS) రంగారావు తెలిపారు. విచారణ నిమిత్తం గురువారం ఆస్పత్రికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తల్లీబిడ్డా మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నానన్నారు.
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్ సింగ్‌కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్‌కి ఆదేశాలిచ్చింది.
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్ సింగ్‌కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్‌కి ఆదేశాలిచ్చింది.
రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమించిన విషయం తెలిసిందే. అయితే తిరుమలరావు గుంటూరు వాసి కృష్ణ నగర్‌లోని మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి వరకు, ఆ తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. ఆయన కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్‌గా పని చేశారు. అనంతరం 1989లో ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్.
మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల పూజల అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ప్రభుత్వంలో కీలక రెవెన్యూ మంత్రిత్వ శాఖను చేపట్టిన అనగాని సత్య ప్రసాద్‌కు పలువురు అభినందనలు తెలిపారు.
నడికుడి, పొందుగుల రైల్వే స్టేషన్ మధ్య గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. అతని ముఖం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. నలుపు రంగు ప్యాంట్ ధరించి వున్నాడు. కుడి చేతిపైన ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉంది. మృతుడి బంధువులు నడికుడి పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
రాజధాని అమరావతిలో రైతులతో ప్రభుత్వం చేసుకున్న కౌలు ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని రైతులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై హామీ ఇచ్చే అవకాశం ఉందని రైతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సత్తెనపల్లి మండల పరిధి కట్టమూరులోని దీపాలదిన్నెపాలెం రహదారి పక్కన ఓ వ్యవసాయ బావిలో దాసరి ఏసుబాబు(22) మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. భట్లూరుకు చెందిన యువకుడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బావిలో పడి చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
బాపట్ల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రరాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
శాంతిభద్రతల స్థాపనలో సచివాలయ, మహిళా పోలీసులు భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. మహిళా పోలీసులు వారి విధులు గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. సైబర్ నేరాలు లోన్ యాప్‌లపై అవగాహన పెరగాలన్నారు. రౌడీషీటర్లపై అవగాహన కలిగి ఉండి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.