India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినుకొండలోని కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజారులో వృద్ధ మహిళను గుర్తు తెలియని యువకుడు బుధవారం హత్య చేశాడు. సమాచారం అందుకున్న సీఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వచ్చి, ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నించగా.. వృద్ద మహిళ పెనుగులాడటంతో హత్యచేసి పరారైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాడికొండ MLA తెనాలి శ్రావణ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తయారయింది. ఈ మేరకు శ్రావణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు “Tenali Srawan Kumar” అనే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని చెప్పారు. ఆ అకౌంట్ నుంచి మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నారని, ఎవరూ స్పందించవద్దని అన్నారు. ఇలాంటివి గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటనపై అరండల్ పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమీనగర్‌లో నివాసం ఉండే లూర్దు మేరి(47) నీటి మోటారుకు పైపు అమరుస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గమనించి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం బాపట్లలో పర్యటించారు. పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కళాశాల వద్ద ఆయనకు పోలీస్ అధికారులు, ఎన్సీసీ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ పి. రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 11,103 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 8,899 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి ప్రకాశరావు మాట్లాడుతూ.. రీ వాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి జూలై 2వ తేదీల లోగా అందజేయాలన్నారు.
జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
తనని గెలిపించిన గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని కూటమి నేతలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళగిరి నుంచి గుంటూరు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్‌కి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్‌ని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై చేపట్టిన చర్యలపై పవన్‌తో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.