India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయల్దేరారు. 10.30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లి.. సాక్షి గణపతి, వీర భద్ర స్వామి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి వాయనం సారె సమర్పించనున్నారు.

ఎయిమ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన మౌలిక సౌకర్యాల పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్ డైరక్టర్, సీఈఓ ప్రొఫెసర్ మధభానందకర్, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్‌తో కలసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎయిమ్స్ విస్తరణకు కొలనుకొండలో ఉన్న భూములను పరిశీలించి 15 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలిసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. జులై 17న పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో YCP కార్యకర్త రషీద్‌ను జిలాని అనే యువకుడు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో నరికి హత్యచేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేశారు. బుధవారం మరో ముగ్గురుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు CI సాంబశివరావు తెలిపారు.

బాపట్ల జిల్లా అభివృద్ధి భవిష్యత్తు దర్శినిపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. చీరాలలో జిల్లా స్థాయి వైద్యశాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపాలన్నారు. అభివృద్ధికి ముఖ్యమైన ఆక్వా పార్క్, నిజాంపట్నం పోర్ట్ విస్తరణపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

* గుంటూరు జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్
* పల్నాడు ఘటనపై పవన్ కళ్యాణ్ వార్నింగ్
* దేశంలో TOP.. మన అమరావతిలో ఓ క్యాంపస్!
* మంగళగిరి TDP ఆఫీసుపై దాడి..ముగ్గురు పోలీసులపై వేటు
* నేటి నుంచి ఆగస్టు 5 వరకు లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు
* భూముల రీసర్వేపై చంద్రబాబు యూటర్న్: అంబటి
* న్యాయం చేయండి.. పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి వినతి
* మాచర్ల: బాంబుల నిల్వ కేసులో మరో వ్యక్తి అరెస్ట్

మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మోడల్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు పనులన్నీ వెంటనే పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురయింది. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. పాల్వాయి గేటులో టీడీపీ ఏజెంట్‌పై దాడి, కారంపూడి సీఐపై దాడి అభియోగాలతో పిన్నెల్లి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా, రెండు కేసుల్లోనూ జడ్జి బెయిల్ నిరాకరించారు. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ప్రత్తిపాడు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్తిపాడులోని ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా రోగులకు వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను సత్కరించారు. అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇద్దరు చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై మైఖేల్ క్రేమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోన్నట్లు సమాచారం.

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై గత ప్రభుత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. సీఐ, ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశారు. అల్లరి మూకల దాడి అరికట్టలేకపోయారని, దాడి తర్వాత కనీస ఆధారాలు సేకరించలేకపోయారని అప్పటి రూరల్ సీఐ భూషణం, ఎస్సైలు లోకేశ్, క్రాంతి కిరణ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.