Guntur

News May 13, 2024

గుంటూరు జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

గుంటూరు జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

నరసరావుపేట కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ ఆదివారం కాకాని వద్ద జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ , స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద నిఘా ఉండేలా చర్య చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News May 12, 2024

గురజాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

మండలంలోని బూదవాడలో దాసరి బ్రహ్మయ్య(30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం సాయంత్రం టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించుకొని. అయ్యప్ప నగర్‌లోని తన నివాసానికి బైక్‌పై బయలుదేరాడు. అయితే బ్రహ్మయ్య ఇంటికి రాకపోయేసరికి.. కుటుంబసభ్యులు అతని కోసం గాలించారు. ఆదివారం రోడ్డు పక్కన అతని మృతదేహాన్ని గుర్తించారు. హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

News May 12, 2024

బాపట్ల చేరుకున్న రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు

image

బాపట్లలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఎన్నికల ఏపీ రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా విశ్రాంత బాపట్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వారితో పాటు ఎన్నికల పోలీస్ పరిశీలకులు కెప్టెన్ అయ్యప్ప, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు.

News May 12, 2024

నిజాంపట్నంలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

మండలంలోని అచ్చుతపురం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పెనుమూడి నుంచి నిజాంపట్నం వెళుతున్న బైకును టాటా మ్యాజిక్ ఢీకొట్టడంతో కొక్కిలిగడ్డ శివకృష్ణ అనే వ్యక్తి మృతిచెందాడు. కొక్కిలిగడ్డ నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 12, 2024

తాడేపల్లి: మోదీ నామినేషన్‌కి చంద్రబాబుకి ఆహ్వానం

image

ప్రధాని మోదీ మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకి మోదీ ఆహ్వానం అందింది. మంగళవారం ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.

News May 12, 2024

చేబ్రోలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మండల పరిధిలోని నారాకోడూరు గ్రామం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. మృతుడు వట్టి చెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తిరుపతయ్య(64)గా గుర్తించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 12, 2024

తాడేపల్లి: ఫేక్ ఆడియోపై చంద్రబాబు స్పందన

image

సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ఆడియోపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

News May 12, 2024

గైర్హాజరైన సిబ్బందిని సస్పెండ్ చేయాలి: శివశంకర్

image

ఎన్నికల విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నెల 14 మధ్యాహ్నం వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఆయన ఆదేశించారు.

News May 12, 2024

ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు: ముకేశ్ కుమార్ సీఈఓ మీనా

image

రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు తీసుకొచ్చామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. సీవిజిల్‌లో వచ్చే ఫిర్యాదుల ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేశాం. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వంద శాతం ఓట్లు పోల్ అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

error: Content is protected !!