India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాయింట్ కలెక్టరుగా గుంటూరు విచ్చేసిన భార్గవ తేజ IASను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు. జిల్లా వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి, మీటింగులు నిర్వహించలేదని గర్తపురి వినియోగదారుల సమితి అధ్యక్షుడు హరిబాబు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లాలో సంబంధిత అధికారులు అమలు జరిపే విధంగా చూడాలని కోరారు. ఆయన వెంట నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, కవిత తదితరులు ఉన్నారు.

* సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ బైక్ దహనం
* తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
* వినుకొండ: రషీద్ హత్య.. నిందితులకు 30 ఏళ్ల లోపే!
* పల్నాడులో ఆగని టీడీపీ దాష్టీకాలు: వైసీపీ
* గుంటూరు: అమరులైన వీర జవానులకు నివాళి
* వినుకొండ హత్యపై మరోసారి స్పందించిన జగన్
* అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఐ
* అమెరికాలో మృతి.. తెనాలి చేరుకున్న రవితేజ మృతదేహం

ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడి తెనాలికి చెందిన యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రవితేజ భౌతికకాయం స్వగ్రామమైన తెనాలి చేరుకుంది. అమెరికాలో MS చేసేందుకు వెళ్లిన రవితేజ, 18న ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. తెనాలిలో ఐతానగర్‌లోని నివాసానికి రవితేజ మృతదేహం చేరుకోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరి నగర పరిధిలోని అరణ్య భవన్‌లో సాయంత్రం నాలుగు గంటలకు సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులు బందోబస్తు పనుల్లో ఉన్నారు.

వినుకొండలో జరిగిన రషీద్ హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. వినుకొండలో వైసీపీ నాయకుడిని దారుణంగా చంపారని, నిందితుడు జిలానీకి టీడీపీ నేతలలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వినుకొండ ఘటనను దారి మళ్లీంచేందుకే మదనపల్లి ఇష్యూ తెచ్చారని జగన్ ఆరోపించారు.

వినుకొండలో జూలై 17న వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జిలానీతో సహా ఇప్పటి వరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో వినుకొండకు చెందిన వారు ఐదుగురు, నరసరావుపేటకు చెందిన ఒకరు, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు ఉన్నారు. వీరంతా 30 సంవత్సరాల వయస్సు లోపువారే అని సీఐ తెలిపారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11.30గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ వద్ద ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో జరుగుతున్న అరాచకాలు, శ్వేత పత్రాల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తోన్న అసత్యాలు ప్రచారాలు సహా పలు అంశాలపై జగన్ మాట్లాడనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.

గుంటూరు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలకు యువత బానిస కాకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చెడు అలవాట్లు వల్ల యువత భవిష్యత్ పాడు చేసుకోకుండా ఆటో ద్వారా విస్తృతంగా పబ్లిక్ అనౌన్సింగ్ సిస్టం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గంగాధరరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 9792 మంది హాజరు కాగా వారిలో 5670 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రెడ్డి ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు చెప్పారు.

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. మీలాగే ఈ రోజు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో మీరు వృద్ధి సాధిస్తూనే ఉండాలి’ అని Xలో పోస్ట్ చేశారు. ఎన్నికల వేళ రోహిత్ పలు జిల్లాలో పర్యటించి టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.