Guntur

News May 11, 2024

మంగళగిరి ప్రజలకు బహిరంగలేఖ: నారా లోకేశ్

image

మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ బహిరంగ లేఖను శనివారం రాశారు. మంగళగిరి ప్రజలపై లోకేశ్‌కు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ లేఖలో తెలియజేశారు. జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైలులో పెట్టినపుడు.. మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడ్డానంటే కారణం నా బలం, బలగమైన మంగళగిరి ప్రజలేనని తెలిపారు.

News May 11, 2024

గుంటూరు జిల్లాలో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

గుంటూరు జిల్లాలో ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ ఈఎస్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలో అతిక్రమించి ఎవరైనా దుకాణాలు, బార్లు తెరిచినా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 11, 2024

గుంటూరు: ఓటర్లకు ప్రలోభాలు.?

image

మరికొన్ని గంటల్లో గుంటూరు జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గుంటూరులో, నరసరావుపేటలో ఓటుకు రూ.2 వేలు, మాచర్లలో రూ.3 వేలు ఒకరు.. రూ.2 వేలు మరొకరు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓ చోట ఏకంగా రూ.5వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. 2వసారి పంపిణీకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

News May 11, 2024

తెనాలిలో తండ్రీ, కూతురు, మనవరాలు గెలుపు

image

గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి రాజకీయాల్లో ఒక కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952, 55, 62లో ఆలపాటి వెంకట రామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయన బాటలోనే ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిరా 1967, 72, 78 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 1999లో ఆయన మనవరాలు గోగినేని ఉమా ఎమ్మెల్యేగా గెలుపొంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు.

News May 11, 2024

సాయంత్రం 6 గంటలకు ప్రచారాలు ఆపివేయాలి: బాపట్ల కలెక్టర్

image

11వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు రాజకీయ అభ్యర్థులు ప్రచారాలు నిలిపివేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 11వ తేదీ ప్రచారాలకు ఆఖరి రోజు అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను రాజకీయ అభ్యర్థులు పాటించాలని కోరారు.

News May 11, 2024

గుంటూరు: యార్డులో 60,876 బస్తాల మిర్చి విక్రయం

image

మార్కెట్ యార్డుకు శుక్రవారం 51,030 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 60,876 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది.

News May 11, 2024

కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు

image

మే 13న జరగనున్న ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, థియేటర్స్ లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేశామన్నారు. 1988లోని సెక్షన్ 2(31)లోని అధికారాలను వినియోగించుకుని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో కార్మికులకు సెలవు ఉంటుందన్నారు

News May 11, 2024

తెనాలి బరిలో ఒకప్పుడు తండ్రీ, కూతురు, మనవరాలు

image

గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి రాజకీయాల్లో ఒక కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952, 55, 62లో ఆలపాటి వెంకట రామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయన బాటలోనే ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిరా 1967, 72, 78 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 1999లో ఆయన మనవరాలు గోగినేని ఉమా ఎమ్మెల్యేగా గెలుపొంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు.

News May 11, 2024

కార్మికులకు మే 13న వేతనంతో కూడిన సెలవు

image

మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు, గుంటూరు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, సినిమా హాల్స్, వాణిజ్య సంస్థలో పనిచేసే కార్మికులకు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు సెలవు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

News May 10, 2024

గుంటూరు: రేపే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన గుంటూరు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

error: Content is protected !!