India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాద స్థలిని అగ్నిమాపకశాఖ అధికారులు పరిశీలించారు. వేగంగా వచ్చిన బస్సు.. టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. దీంతో అందులోని ఆయిల్ బస్సు అంతటా పడటంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయని అగ్నిమాపకశాఖ అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ANUలో ఓట్లు లెక్కించనున్నారు. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్‌కు టేబుళ్లు, బారికేడ్లు, CC కెమెరాలు తదితర సౌకర్యాలను ROలు పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. రౌండ్ల వారీగా వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందజేయాలని స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే పల్నాడు జిల్లా SPని సస్పెండ్ చేయగా.. కలెక్టర్‌ను బదిలీ చేశారు. గురజాల డీఎస్పీ ఎ.పల్లపురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు, బాల నాగిరెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారంపూడి, నాగార్జునసాగర్ ఎస్సైలు.. ఎం.రామాంజనేయులు, డీవీ కొండారెడ్డిలపై కూడా సస్పెండ్ వేటు వేశారు.
పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సీఈసీ అధికారిక ప్రకటన చేసింది. సీఎస్, డీజీపీల నుంచి తీసుకున్న వివరణ తర్వాత పల్నాడు ఎస్పీ బిందు మాధవ్‌ను సస్పెండ్ చేసి, కలెక్టర్ శివశంకర్‌ను బదిలీ చేసింది. వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ రోజు, ముగిసిన తర్వాత పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.
బాపట్ల జిల్లాలో కూటమి ఏడు నియోజకవర్గాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు చెప్పారు. గురువారం బాపట్ల పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల అభ్యర్థులు విజయంలో జనసేన శ్రేణులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరిగిన దాడి విషయాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
చిలకలూరిపేట మం. పసుమర్రు బస్సు ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో కాశీ బ్రహ్మేశ్వరరావు(64), ఆయన భార్య లక్షీ(55), మనవరాలు ఖ్యాతి శ్రీసాయి(9) ఉన్నారు. బ్రహ్మేశ్వరరావు దంపతులకు భావన, పూజిత కుమార్తెలు. పూజిత కుమార్తె అయిన ఖ్యాతి, భావన, దంపతులు బస్సులో ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో భావన కిటికీలోంచి దూకి ప్రాణాలతో బయటపడగా.. ఆమె కళ్ల ముందే కన్నవాళ్లు, సోదరి కుమార్తె సజీవ దహనమయ్యారు.
వైసీపీ నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మారుస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాడులను నియంత్రించడంలో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. మాచవరం మం. పిన్నెల్లిలో భారీగా బాంబులు బయటపడినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే, అరాచకవాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ పదవి విషయంలో వివరణ తీసుకోకుండానే మండలి ఛైర్మన్ తనను అనర్హుడిగా ప్రకటించినట్లు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. గురువారం గుంటూరులో గృహనిర్బంధంలో ఉన్న జంగా మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందినవాడిని కావడం వల్లనే తనపై వివక్ష చూపుతున్నారని జంగా ఆవేదన వ్యక్తం చేశారు
చినగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట వద్ద లారీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, గాయపడిన 30 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 20 మంది చినగంజాం వాసులే.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కాగా గురువారంతో ఈ మహాయాగం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో జగన్‌కు వేదపండితులు తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Sorry, no posts matched your criteria.