India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలు-2024 లో బాగంగా ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల పరిశీలకులు, కేంద్ర బలగాలు ,పోలీస్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ వకుల్ జిందాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందురోజు వరకు ప్రతి గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని తెలిపారు. హోటల్స్, లాడ్జిలను తనిఖీ చేస్తూ అనుమానితులు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
పల్నాడు జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఈ నెల 9న నర్సరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల చేత ఓటు వేయని ఉద్యోగులకు నరసరావుపేట SSN కాలేజీలో గల ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. ఫామ్ 12 సమర్పించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన తప్పట్ల పాపారావు అనే రైతు మంగళవారం కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి మరణించినట్లు మృతుడి కుమారుడు తెలిపారు. మృతుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడని, పొలం నుంచి వస్తుండగా పిడుగు పడి మరణించినట్లు వివరించారు. ఈ మేరకు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో బుధవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. పరస్పర దాడుల్లో ఇరు పార్టీలవారికి పిన్నెల్లి సతీమణి రమాకి గాయం కాగా, మాజీ MPP కారు ధ్వంసమైంది. ఇరు వర్గాలను చెదరగొడుతున్న సందర్భంలో ఎస్సై శ్రీహరికి కూడా గాయాలయ్యాయి.
జిల్లాలో మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో 3.1 లీటర్ల మద్యం, ప్రత్తిపాడు పరిధిలో 142.52 లీటర్ల మద్యం జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. తాడికొండ పరిధిలో రూ.1.05 లక్షల నగదు, పొన్నూరు పరిధిలో 21.96 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. జిల్లాలో మే 7వ తేది వరకు రూ.3,19,49,811 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశామన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమి అభ్యర్థులకు నవతరం పార్టీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయాన్ని సమర్థిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. రావు సుబ్రహ్మణ్యం మంగళగిరి, చిలకలూరిపేటలో నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
విజయవాడలో మోదీ టూర్ సందర్భంగా.. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మళ్లించారు. బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని NH16 వైపు వెళ్లాలి. GNT నుంచి HYD వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణించాలి.
విజయవాడలో రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 6.30గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. స్క్యూ బ్రిడ్జి దాటిన తర్వాత వెటర్నరీ జంక్షన్ మీదుగా పీవీపీ మాల్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న బెంజ్ సర్కిల్ దాకా.. రాత్రి 7 నుంచి 8 వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నగరాలు, ప్రత్తిపాడు గోరంట్ల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటర్లు తప్ప ఇంకెవరు ఉండకూడదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.