Guntur

News May 7, 2024

రేపల్లెలో అనగాని సత్యప్రసాద్‌ను గెలిపించాలి: హీరో రోహిత్

image

రాష్ట్రానికి పూర్వ వైభవం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. మంగళవారం చెరుకుపల్లి మండలం బలుసులవారిపాలెం, మెట్టగౌడవారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేపల్లె అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ది చేశాడన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో సత్యప్రసాద్‌ను గెలిపించాలని కోరారు.

News May 7, 2024

పల్నాడు: పిడుగుపాటుకు గురై తల్లీ కూతుళ్లు మృతి

image

క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామ పరిధిలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై తల్లీ కూతుళ్లు మృతి చెందారు. చనిపోయినవారు బొందల నాగేంద్రం (52) నాగరాణి (25)గా గుర్తించారు. వీరిద్దరూ పొలానికి వెళ్లి వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన ప్రారంభమై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News May 7, 2024

పొన్నూరు: సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి

image

సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. పొన్నూరులో సచివాలయ ఉద్యోగి తిరుమేళ్ల కిషోర్ బాబు అనుమానాస్పదంగా మృతిచెందాడు. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం 6గంటలకు వాటర్ లెవెల్స్ తీయడానికి మున్సిపల్ వాటర్ వర్క్స్‌లోని 100 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు వచ్చి ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 7, 2024

ఇద్దరు అధికారులపై పల్నాడు కలెక్టర్ చర్యలు

image

నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న పోస్టల్ బ్యాలెట్‌కు బదులుగా ఈవీఎం పేపర్లను అధికారులు జారీ చేశారు. దీంతో ఇరువురిపై చర్యలు తీసుకున్నారు. 5న ఓటింగ్‌లో పాల్గొన్న 1,219మంది ఉద్యోగులు 8, 9 తేదీల్లో ఓటు వేయాలని సూచించారు.

News May 7, 2024

మోదీకి మంగళగిరి చేనేత కండువాతో లోకేశ్ సత్కారం

image

రాజమండ్రిలో సోమవారం జరిగిన ప్రధాని మోదీ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీని మంగళగిరి చేనేత కండువాతో నారా లోకేశ్ సత్కరించారు. ప్రధానిని చేనేత కండువాతో సత్కరించడంతో మంగళగిరిలోని చేనేత వర్గీయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పర్యటన చేస్తున్నారు. నేటి నుంచి తిరిగి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.

News May 7, 2024

నేడు పొన్నూరు, రేపల్లెలో నారా రోహిత్ ప్రచారం

image

సినీ హీరో నారా రోహిత్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం ఆయన పొన్నూరు, రేపల్లెలో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అనగాని సత్యప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.

News May 7, 2024

2 రోజుల్లో 9,364 మంది ఓటు హక్కు వినియోగం

image

పల్నాడు జిల్లాలో మొత్తం 16,282 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల కాలంలో 9364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో 4,722 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 20,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 5,751 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 2,778 మంది ఉన్నారు.

News May 7, 2024

గుంటూరు: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్(35) దంపతులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారు చేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడులోని జగనన్న కాలనీ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.

News May 7, 2024

చిలకలూరిపేట: భావోద్వేగానికి గురైన వెంకటకుమారి

image

చిలకలూరిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా తరలివచ్చిన మహిళల సమక్షంలో కొంగుపట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నా అంటూ పుల్లారావు సతీమణి వెంకటకుమారి కన్నీటి పర్యంతమయ్యారు. పాతికేళ్ల ప్రస్థానంలో ప్రతిక్షణం చిలకలూరిపేట ప్రజల కోసమే ఆయన ఆలోచించారన్నారు. మంచి మనిషిపై గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో అభాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

News May 7, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం బాపట్ల జిల్లాలోని కర్లపాలెం, చందోలు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. గత ఎన్నికల పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఉంటుందన్నారు.

error: Content is protected !!