India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో తొలిసారి 1952వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎల్.వి.ఎల్ లక్ష్మీ నరసింహం, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా ఎన్.జి రంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నరసింహం 17,517 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుంటూరు లోక్ సభ స్థానానికి ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఈయనకు మద్దతిచ్చింది.
భర్తను హత్య చేయించిన భార్యను, <<13183665>>ఆమె ప్రియుడిని<<>> సోమవారం కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. ప్రేమ్ కుమార్ పండ్ల వ్యాపారం చేస్తుండేవాడు. అతని భార్య భారతి సమోసాలు తయారీకి వెళ్లి యజమాని గౌస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రేమ్ కుమార్ ఆమెను మందలించగా.. తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్రియుడు సూచించాడు. గౌస్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రేమ్‌కు మద్యం తాగించి హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేయడంతో నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పల్నాడు రోడ్డులో ఉన్న SSN కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం బయట టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ కారు ధ్వంసమైంది. దీంతో కేంద్ర బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టగా.. పలువురు రాళ్లు రువ్వారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జిల్లాలో హోం ఓటింగ్ ఎంచుకున్న వారికి సంబంధించి ఆదివారం మంగళగిరిలో 124, పొన్నూరులో 21 కలిపి 145 ఓట్లు పోలయ్యాయి. 3, 4 తేదీల్లో జరిగిన పోలింగ్లో 1,924 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2348 మందికి హోం ఓటింగ్ ను ఎంచుకోగా ఇప్పటివరకూ 2069 మంది ఓటు వేశారు. ఇప్పటి వరకూ తాడికొండ నియోజకవర్గంలో 336, మంగళగిరి 440, పొన్నూరు 284, తెనాలి 344, ప్రత్తిపాడు 360, గుంటూరు వెస్ట్ 210, గుంటూరు ఈస్ట్ 95 మంది ఓట్లు వేశారు.
గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 97.6 శాతం హాజరు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 4029 మందికిగాను 3933 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే వేసవి తీవ్రత వల్ల అభ్యర్థులతోపాటు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు అసౌకర్యానికి గురయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
‘కొందరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను సాయం చేసి బతికించిన వ్యక్తులు, నావల్ల పదవులు పొంది ఎదిగిన వారు,నాకు అవసరమైన సమయంలో నన్ను వదిలి మోసం చేసి వెళ్లారు’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ బాధ గుండెను పిండేస్తోందని చెప్పారు. ఆదివారం రాత్రి సత్తెనపల్లిలోని ఆవుల సత్రంలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవేనా మానవ సంబంధాలు అంటూ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లాలో తుది జాబితా ప్రకారం 17,91,543 మంది ఓటర్లు ఉన్నారని, ఆ జాబితాను గుర్తింపు పొందిన పార్టీలకు అందజేశామని కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఓటరు స్లిప్పులను సిబ్బంది ప్రతి ఓటరుకు అందించటానికి చర్యలు తీసుకున్నామన్నారు. 5, 6 తేదీల్లో పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఉన్నందున, శిక్షణ ముగిసిన తర్వాత 4 గంటల నుంచి ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయొచ్చన్నారు.
సీఎం జగన్ సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు రేపల్లెలో ఉన్న డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మాచర్ల శ్రీనివాస్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మచిలీపట్నం బయల్దేరి వెళతారు.
ఖాజీపేట- గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు కారణంగా ఈ నెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డీఆర్ఎం ఎమ్.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు: ట్రైన్ నం. 12705 గుంటూరు- సికింద్రాబాద్, 12706 సికింద్రాబాద్- గుంటూరు, ట్రైన్ నం.17201 గుంటూరు- సికింద్రాబాద్, ట్రైన్ నం.17202 సికింద్రాబాద్- గుంటూరు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.