India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గల్లా మాధవి విజయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి విడుదల రజనీపై 49722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారిగా రాజకీయంలోకి వచ్చిన గల్లా మాధవి చివరి క్షణంలో అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు పొందారు. ఏకంగా ఒక మంత్రిపై గెలుపొంది సంచలనం సృష్టించారు. దీంతో టీడీపీ శ్రేణులు గుంటూరులో సంబరాలు చేసుకున్నాయి.
నారా లోకేశ్ 85,140 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లకు గానూ, 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేశ్‌కు 155462 ఓట్లు, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు 70322 ఓట్లు వచ్చాయి. నారా లోకేశ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆయన 3,16,231 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 7,64,321 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 4,48,090 ఓట్లు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌కు 4,026 ఓట్లు వచ్చాయి.
చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కావటి మనోహర్ నాయుడిపై 32,098 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులను మంగళవారం జిల్లా ఎస్పీ తుషార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం జిల్లాలోని పరిస్థితులను నాగార్జున యూనివర్సిటీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు.
గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమీప ప్రత్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై 25వేల + ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి రాజకీయాలలో ఉన్న యరపతినేని గురజాల కు ఒకే పార్టీ నుండి నుంచి ఏడు సార్లు పోటీ చేసి రికార్డ్ సృష్టించారు. తాజా గెలుపుతో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. 18 రౌండ్లు పూర్తి అయ్యేసరికి, 22 వేల + ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి ఆయనకు 20,480 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రవీణ్.. తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. భాష్యం ప్రవీణ్ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ విజయం సాధించారు. ఆయన మొత్తం 15 రౌండ్లు ముగిసేసరికి 26,800 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆయనకు 88,827 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి 62,027 ఓట్లు నమోదయ్యాయి. 1999 తరువాత 2024లో బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేశారు. నరేంద్ర మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.
సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.