India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 13వ తేదీన నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలు, వివి ప్యాట్లను అధికారులు పంపిణీకి సిద్ధం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంకు ఈవీఎం, వివి ప్యాడ్ ఇతర సామాగ్రిని ఒక ప్రత్యేక బ్యాగులో ఏర్పాటు చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని పంపిణీ కేంద్రాలను గుంటూరు పశ్చిమ రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి శనివారం పరిశీలించారు. పశ్చిమ పరిధిలోని 292 పోలింగ్ కేంద్రాలకు ఆదివారం ఈవీఎంల పంపిణీ చేస్తామన్నారు.
నేటి సాయంత్రం 6:00 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా.. 144 సెక్షన్ విధిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరూ కూడా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు దాదాపు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది. ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.
మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ బహిరంగ లేఖను శనివారం రాశారు. మంగళగిరి ప్రజలపై లోకేశ్‌కు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ లేఖలో తెలియజేశారు. జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైలులో పెట్టినపుడు.. మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడ్డానంటే కారణం నా బలం, బలగమైన మంగళగిరి ప్రజలేనని తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ ఈఎస్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలో అతిక్రమించి ఎవరైనా దుకాణాలు, బార్లు తెరిచినా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరికొన్ని గంటల్లో గుంటూరు జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గుంటూరులో, నరసరావుపేటలో ఓటుకు రూ.2 వేలు, మాచర్లలో రూ.3 వేలు ఒకరు.. రూ.2 వేలు మరొకరు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓ చోట ఏకంగా రూ.5వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. 2వసారి పంపిణీకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి రాజకీయాల్లో ఒక కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952, 55, 62లో ఆలపాటి వెంకట రామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయన బాటలోనే ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిరా 1967, 72, 78 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 1999లో ఆయన మనవరాలు గోగినేని ఉమా ఎమ్మెల్యేగా గెలుపొంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు.
11వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు రాజకీయ అభ్యర్థులు ప్రచారాలు నిలిపివేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 11వ తేదీ ప్రచారాలకు ఆఖరి రోజు అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను రాజకీయ అభ్యర్థులు పాటించాలని కోరారు.
మార్కెట్ యార్డుకు శుక్రవారం 51,030 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 60,876 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది.
మే 13న జరగనున్న ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, థియేటర్స్ లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేశామన్నారు. 1988లోని సెక్షన్ 2(31)లోని అధికారాలను వినియోగించుకుని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో కార్మికులకు సెలవు ఉంటుందన్నారు
Sorry, no posts matched your criteria.