India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొన్నూరు పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 5న పవన్ ఉదయం 10 గంటలకు, హెలికాప్టర్‌లో పొన్నూరులోని సజ్జ ఫంక్షన్ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఐలాండ్ సెంటర్‌లో ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద 11 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 12 గంటలకు పవన్ తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పెన్షన్ నగదు తీసుకునేందుకు బ్యాంక్‌ల వద్ద వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మంగళగిరి యూనియన్ బ్యాంకు వద్ద పెన్షన్ తీసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ఫించనుదారులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పెన్షన్ దారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో వృద్ధురాలికి గాయాలు అయ్యాయి.
గుంటూరులో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.0 డిగ్రీలుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా పలువురు వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. ఆయన కౌన్సిల్ హాలులో ఎన్నికల అధికారులతో మాట్లాడారు. 80 ఏళ్లుపైన ఉండి హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రోసూరులోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభ వద్దకు జగన్ మధ్యాహ్నం 12గంటలకు చేరుకొని, ప్రసంగించనున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్పీ బిందు మాధవ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నకరికల్లు సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో నరసరావుపేట మండలం కేసానపల్లికి చెందిన ఏడుకొండలు మృతిచెందాడు. నకరికల్లు మండలం గుండ్లపల్లి నుంచి స్వగ్రామానికి వెళుతూ.. మార్గమధ్యంలో తేనె విక్రయిస్తున్న వ్యక్తితో మాట్లాడేందుకు బైకును రోడ్డు పక్కన ఆపిన క్రమంలో అటుగా వెళుతున్న క్రేన్ వాహనం అతనిని ఢీకొట్టింది. దీంతో అతను మృతిచెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.
గుంటూరు మార్కెట్ యార్డుకు ఈనెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ యార్డులోని కార్మిక సంఘాలు, దిగుమతి వ్యాపారుల సంఘం అభ్యర్థన మేరకు
వేసవి కాలంలో ఎండ తీవ్రత కారణంగా వేసవి సెలవులు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు తమ సరుకును ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే యార్డులోకి తీసుకురావాలన్నారు.
మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,62,404 ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి జె. శ్యామ్‌ప్రసాద్ గురువారం తెలిపారు. పురుషుల సంఖ్య 1,28,639, స్త్రీల సంఖ్య 1,33,743, ఇతరులు 22 ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో 299 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీటిలో 151 క్రిటికల్ పోలింగ్ బూత్‌లు ఉన్నాయని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి కోరారు.
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి జిల్లాకు విచ్చేసిన సాయుధ బలగాల అధికారులతో, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖతో సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని తెలిపారు.
అనుమతులు లేని మద్యం బాటిల్లను పల్నాడు జిల్లా ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాజుపాలెం మండలం కొండమూడు గ్రామానికి చెందిన ఓ మద్యం షాపులో అనుమతులు లేకుండా రవాణాకు సిద్ధంగా ఉంచిన, మద్యం బాటిల్లను అధికారులు గుర్తించారు. మొత్తం వెయ్యికి పైగా మద్యం బాటిల్ను గుర్తించినట్లు, వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.