Guntur

News May 2, 2024

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్రస్థాయి రెస్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం మల్లికార్జునరావు గురువారం తెలిపారు. గత నెల 28వ తేదీన నరసరావుపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు పాల్గొన్నారు. ఈనెల 3, 4 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, పీఈటీ సునీల్‌ను హెచ్ఎం, గ్రామ పెద్దలు అభినందించారు.

News May 2, 2024

ఈనెల 3న రేపల్లె రానున్న సీఎం జగన్

image

సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 3న ఉదయం 11 గంటలకు రేపల్లె నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారని వైసీపీ నేత మోపిదేవి హరినాథ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News May 2, 2024

పెదకూరపాడు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడిన విషాద ఘటన బుధవారం సాయంత్రం పెదకూరపాడు మండలం రామాపురంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సందీప్(10), అభినయ్(12) ఇద్దరు కలిసి వేసవి సెలవులు కావడంతో గ్రామ శివారు పోలేరమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఉన్న ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి ఈత రాక మునిగి చనిపోయారు.

News May 2, 2024

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు: వేణుగోపాల్ రెడ్డి

image

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు ప్రచార కార్యక్రమంలో ఎన్నికల కోడ్‌ని కచ్చితంగా పాటించాలని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
అభ్యర్ధుల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లు, ఎఫ్ఎస్టీ బృందాలు, ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమలుపై బుధవారం
సమావేశం నిర్వహించారు.

News May 1, 2024

గుంటూరు కారం ఘాటు చూపించారు: చంద్రబాబు 

image

చంద్రబాబు బుధవారం గుంటూరులోని హిమనీ సెంటర్లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను,  కానీ గుంటూరు కార్యకర్తల్లో ఉన్న జోష్ ఎక్కడా చూడలేదు’ అన్నారు. గుంటూరు కారం ఘాటును చూపించారని చమత్కరించారు. చిన్నపిల్లలు పసుపు చీర కట్టుకొని మా భవిష్యత్తు నీవే అంటూ సభకు రావడం చూసి తన జీవితం ధన్యమైందన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్, మాధవి ఉన్నారు.

News May 1, 2024

3న క్రోసూరులో సీఎం జగన్ సభ.. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

image

సీఎం జగన్ ఈ నెల 3న క్రోసూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. సభా స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్ల గురించి స్థానిక పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News May 1, 2024

కారుకు పంక్చర్ వేస్తూ యువకుడు మృతి

image

కారుకు పంక్చర్ వేస్తూ యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం పెదకూరపాడు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కారు టైరుకు పంక్చర్ వేయడానికి యువకుడు భూపతిరెడ్డి జాకీ బిగించాడు. అనంతరం కారు కిందకి వెళ్లి చెక్ చేస్తుండగా, జాకీ తొలగిపోయి కారు తలపై పడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 1, 2024

గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత లోకేశ్‌ది: బ్రాహ్మణి

image

డ్వాక్రా పేరు చెబితే CBN ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే లోకేశ్ అలా గుర్తుకొస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళవారం సాయంత్రం దుగ్గిరాల మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. లోకేశ్‌ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి.. నియోజకవర్గం అభివృద్ధి లోకేశ్ బాధ్యతని బ్రాహ్మణి చెప్పారు. పసుపు మిల్లును సందర్శించి పసుపు కొమ్ముల నుంచి పసుపును ఎలా తయారు చేస్తారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

News May 1, 2024

తాడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడి మృతి

image

తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వస్తున్న బాలుడిని JCB ఢీకొగా ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News May 1, 2024

రాజుపాలెం: బావిలో పడి వివాహిత మృతి

image

బావిలో పడి వివాహిత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజుపాలెం మండలం ఇనిమెట్లకు చెందిన అన్నపూర్ణ పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లింది. తాగునీటి కోసం సమీపంలోని నేలబావి వద్దకు వెళ్లగా.. కాలుజారి బావిలో పడి మృతి చెందింది. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. చివరికి బావిలో శవమై కనిపించింది. మృతురాలి తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!