India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్లే ఓ ట్రావెల్ బస్సు లింగంగుంట్ల వద్ద కరెంట్ స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తాడేపల్లి మండలంలోని ఉండవల్లి నివాసానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ముఖ్యనేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పోస్టల్ బ్యాలెట్‌పై వివాదాల రేపేందుకు తంటాలు పడుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వారి దింపుడుకళ్లెం ఆశలు ఫలించవని, ఆ పార్టీ ఓటమి పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కానుందన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాశ్వతంగా దూరమైపోయిందన్నారు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా, సత్వరమే చేయడం కోసం సహాయకంగా నియమించిన ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలన్నారు.
కౌంటింగ్ రోజు ఏర్పడే అవాంఛనీయ ఘటనలను ఆదిలోనే కట్టడి చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 5 డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఏపీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేష సాయి అందించిన సేవలు ప్రసంశనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నశేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బ్రాడీపేట 2/17 రోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ తెలిపారు.
చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాతపూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ భోగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు జూన్ 2,3,4,5 తేదీలలో షాపులు పూర్తిగా మూసి వేయనున్నట్లు, నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శనివారం ఐదు గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనంతరం షాపులు మూసి వేయవలసిందిగా కిషోర్ కోరారు.
Sorry, no posts matched your criteria.