India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపట్ల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 151 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, చివరగా 104 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. బాపట్ల పార్లమెంటు నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. అసెంబ్లీల వారీగా వేమూరు 15, రేపల్లె 14, బాపట్ల 15, పర్చూరు 15, అద్దంకి 15, చీరాల 15 మంది అభ్యర్థులు రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ శివ శంకర్ సోమవారం తెలిపారు. పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పెదకూరపాడు 11, చిలకలూరిపేట 25, నరసరావుపేట 14, సత్తెనపల్లి 15, వినుకొండ 14, గురజాల 13, మాచర్ల 15 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నట్లు తెలిపారు.
గుంటూరు నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లు తెలిపారు. గుంటూరులో వారు మాట్లాడుతూ.. మే 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న బొలెరోను సోమవారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పల్టీ కొడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంతో బొలెరోలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉండగా.. వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని 108లో గురజాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్లు ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్నది. పార్లమెంటు అసెంబ్లీ పరిధిలో ఎంతమంది నామినేషన్లు ఉప సంహరించుకుంటారో సర్వత్ర ఆసక్తిగా మారింది. తమ పేరును పోలి ఉన్న అభ్యర్థులతో ప్రధాన రాజకీయ పార్టీలు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చర్చలు జరుపుతున్నారు. ఉపసంహరించుకున్న అభ్యర్థులకు భారీ ఎత్తున నగదు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తమను ఉన్నత స్థానాలకు చేరేలా విద్యను అందించిన ఉపాద్యాయులకు విద్యార్థులు అనేక రకాలుగా కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో, చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బండి జేమ్స్ అనే ఉపాధ్యాయుడికి పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.12 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరసింహారావు, అధ్యాపకులు ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పొన్నూరుకు వస్తున్నారు. పి. గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో మధ్నాహ్నం 3 గంటలకు స్థానిక జీబీసీ రహదారిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఎన్నికల ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.
సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే- మాసానికి సంబంధించి కలెక్టర్ శివ శంకర్ ఆదివారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో గల 2,83,665 మంది పింఛన్ దారులకు రెండు విధాలుగా.. మే ఒకటో తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డీబీటీ ద్వారా వారి ఖాతాలోకి ఒక పద్దతి, రాలేని వారికి ఇంటి వద్ద సచివాలయ సిబ్బంది ఇవ్వడం మరో పద్దతి అన్నారు.
జిల్లాలో ఆదివారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమలో 1.62 లీటర్ల మద్యం, పొన్నూరులో 7.2 లీటర్ల మద్యం, రూ.2,70 లక్షలు నగదు సీజ్ చేశామన్నారు. తెనాలి పరిధిలో రూ.2,21,100/-ల నగదు, తాడికొండ పరిధిలో రూ.1,20 లక్షలు, ప్రత్తిపాడు పరిధిలో రూ. లక్ష నగదు పట్టుకున్నామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.2,53,42,262/- విలువ గల మద్యం, నగదు సీజ్ చేశామన్నారు.
తాను రూ.2వేల కోట్లు సంపాదించానని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అబద్ధాలు చెబుతున్నారని, దమ్ముంటే నిరూపించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. నిరూపించకపోతే పెమ్మసానికి ఉన్న రూ.5,700 కోట్లు తనకు ఇవ్వాలన్నారు. చంద్రబాబుకు గుంటూరు MP అభ్యర్థి దొరక్క అమెరికా నుంచి డబ్బుల సంచులతో పెమ్మసానిని దిగుమతి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.