India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదలైనట్లు ఆ శాఖ జిల్లా సమన్వయకర్త కేఎంఏ హుస్సేన్ శనివారం తెలిపారు. సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆయన సూచించారు. జూన్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.
నామినేషన్ అఫిడవిట్‌లో పోలీసు కేసుల వివరాలు నమోదు చేయకపోవడంపై స్వతంత్ర అభ్యర్థి బొర్రా వెంకట అప్పారావుకు నోటీసు అందజేసినట్లు ఎన్నికల అధికారి వి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన నామినేషన్ అఫిడవిట్‌లో సత్తెనపల్లి పట్టణం, నకరికల్లు పోలీసు స్టేషన్లలో గతేడాది నమోదైన 2కేసుల వివరాలు నమోదు చేయలేదని అన్నారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ..లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని RO నోటీసులో పేర్కొన్నారు.
బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్ పేట జగనన్న కాలనీ హైవే వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు వెంగళ విహర్‌కు చెందిన వారుగా గుర్తించారు.
గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో 17,91,543 మందికి ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. జిల్లాలో పురుష ఓటర్లు 8,65,377 మంది, మహిళలు 9,26,007 మంది, మూడో వర్గం 159 మంది కలిపి మొత్తం 17,91,543 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 60,630 మంది ఎక్కువ. తుది జాబితాలో ఓటు పొందిన వారు మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేశ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఇందిరా నగర్‌లో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. స్టేడియం పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శనివారం ప్లయింగ్ స్క్వాడ్ లు నిర్వహించిన తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.1,00,000/- నగదు పట్టుబడింది. అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.66,500/- ల నగదు సీజ్ చేశారు. జిల్లాలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 27వ తేది వరకు రూ.2,46 కోట్ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.
పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో శనివారం ఇద్దరు చిన్నారులు నీటి గుంతలతో దిగి మృత్యువాత పడ్డారు. వేణుగోపాల్ (11), ధనుష్ (13)లు వేసవి సెలవులు కావడంతో మేనమామ ఊరు కన్నెగండ్లకు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం అల్లిపరవు వాగు వద్ద ఉన్న పొలాలకు నీరు నిల్వ చేసుకోవడానికి తవ్విన గుంతలో ఈతకు దిగారు. గుంతలో మట్టి చేరి ఉండడంతో ఇరుక్కుపోయి ఊపిరి ఆడగా మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. తొలుత ఈనెల 26 వరకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఒకటవ తేదీ వరకు గడువును పొడిగించిందన్నారు. కావున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
శనివారం జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో లోకేశ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచి, పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత తనదన్నారు.
అంబటి మురళీకృష్ణ సేవ పేరుతో పొన్నూరు ప్రజలను వంచించడానికి రాజకీయాల్లోకి వచ్చాడంటూ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. పొన్నూరులో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తెనపల్లికి మురళీకృష్ణ షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగ శక్తిగా ఎదిగాడన్నారు. ఒక దొంగను గత ఐదేళ్లుగా భరించామని.. ఇంకో గజదొంగ వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. గజదొంగ నిజస్వరూపం బయట పెడతామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.