India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ ఈ నెల 6న మాచర్లలో పర్యటించనున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం వస్తున్నారని చెప్పారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆయన రేపల్లెలో జరగనున్న సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుమ్మడి కోటేశ్వరరావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ శనివారం తెలిపారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా మాచర్ల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పాటు నామినేషన్ ఉపసంహరించుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ నామినేషన్ వెనక్కితీసుకోకపోవడంతో బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
తాడేపల్లి బైపాస్‌లో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ కాలేజీ విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్స్‌ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ కలిగి ఉన్న విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన హోం ఓటింగ్ ప్రక్రియలో 2వేలకు పైగా దరఖాస్తులు రాగా.. 1,011 మంది ఓటేశారు. తాటికొండలో 449 మంది దరఖాస్తు చేసుకోగా 122మంది ఓటేశారు. మంగళగిరిలో 452కు 151, పొన్నూరులో 284కు 114 , తెనాలిలో 352కు 166, ప్రత్తిపాడులో 367 కు 200, గుంటూరు పశ్చిమలో 247 కు 187, గుంటూరు తూర్పులో 79 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది ఓటేశారని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో మే 13 న జరగనున్న ఎన్నికలకు 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ మేరకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని,1309 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో శుక్రవారం ఈవీఎంల అదనపు కేటాయింపు ప్రక్రియపై పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు . అందులో భాగంగా వివరాలు వెల్లడించారు.
వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ పరీక్ష ఈనెల 5న ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు 4,089 మంది విద్యార్థులు హాజరవుతుండగా, గుంటూరులో 7 పొన్నూరులో ఒక కేంద్రంలో పరీక్ష జరగనుంది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుందని, మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో శుక్రవారం ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.2 లక్షలు, తాడికొండ పరిధిలో రూ.1,28,500ల నగదు సీజ్ చేశామన్నారు. గుంటూరు తూర్పు పరిధిలో 3.75లీటర్ల మద్యం, తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.70,300ల నగదు జప్తు చేశామన్నారు. జిల్లాలో మే 3వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,79,46,507ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.
తెనాలి, గుంటూరులో నడుస్తున్న మూడు ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బండి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 9 వ తరగతి వరకు గురుకులాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు గురుకులాల్లో సంప్రదించాలన్నారు.
బాపట్ల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బాపట్ల జిల్లా ఎన్నికల పరిశీలకులు పరిమళ సింగ్ చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎస్పీతో కలిసి భారత ఎన్నికల కమిషనర్ నితీశ్ వియాస్‌తో వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించామని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరిశీలకులను నియమించామన్నారు.
Sorry, no posts matched your criteria.