India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29వ తేదీ ఓటర్లతో తుది జాబితా విడుదల చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 29న చిహ్నాలను కేటాయిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో మొత్తం 147 నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా బూరె సర్వేశ్వరుడు నరేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటి అబ్జర్వర్‌ను కలిశారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మే 13న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మే 5 నుంచి 8వరకు మాత్రమే ఆయా నియోజకవర్గములో ఏర్పాటు చేయబడిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో మాత్రమే, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించామని చెప్పారు.
గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం 64 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందజేసిన నామినేషన్ల నియోజకవర్గాల వారీ వివరాలు.. తాడికొండ నియోజకవర్గం 5, మంగళగిరిలో 17, పొన్నూరులో 5, తెనాలిలో 5, ప్రత్తిపాడు లో 20, గుంటూరు పశ్చిమలో 9, గుంటూరు తూర్పులో మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంటూరు ఎంపీగా తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షా 50 వేల ఓట్ల పైనే మెజార్టీ వస్తుందన్నారు. తాను కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. అలాంటి తనతో జగన్‌ను పోల్చడం సరికాదన్నారు. కష్టపడి పైకొచ్చిన ఎవరితో అయినా జగన్‌ను పోల్చి చూడటం అవమానకరమని పెమ్మసాని వివరించారు.
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ.4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఒక పోలీస్ కేసు నమోదైంది.
నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా జంగా ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని జంగా చెప్పారు.
ఎన్నికల విధులకు నియమించబడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు బాపట్ల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సర్వీసులు కింద పని చేస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12డీలను ఏప్రిల్ 26 లోగా రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు.
ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజాన్ సింగ్ బుధవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాకు విచ్చేసిన వారికి కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ఆరా తీశారు.
జిల్లాలో ఆరవ రోజు బుధవారం మొత్తం 64 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. అత్యధికంగా నరసరావుపేట పార్లమెంటుకు 10, అసెంబ్లీ స్థానానికి 11, నామినేషన్లు వేశారని చెప్పారు. పెదకూరపాడు అసెంబ్లీకి 7, చిలకలూరిపేట అసెంబ్లీకి 7 సత్తెనపల్లి అసెంబ్లీకి 9 వినుకొండ అసెంబ్లీకి 6, గురజాల అసెంబ్లీకి 7, మాచర్ల అసెంబ్లీకి 7 ,నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.