India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో దంపతుల ఉమ్మడి ఆస్తి రూ.109.47 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వర్మ పేరిట చరాస్తులు రూ.73.72 కోట్లు, స్థిరాస్తులు రూ.22.59 కోట్లు.. అప్పు రూ.25.91 కోట్లు ఉంది. భార్య హరికుమారికి రూ.11.29 కోట్ల చరాస్తులు, రూ.1.87 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఈయనకు సొంత కారు లేదు. 9 పోలీసులు కేసులున్నాయి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందజేసిన అఫిడవిట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్ల కాలంలో ఆయనపై 13 కేసులు నమోదయ్యాయి. పుల్లారావు పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు రూ.15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్, ప్రత్తిపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు, గురజాల వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
పొన్నూరు YCP అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ మంగళవారం నామినేషన్ వేయలేకపోయారు. నిన్న ఉదయం ఆయన పెదకాకాని మండలం నంబూరు నుంచి వైసీపీ శ్రేణులతో ర్యాలీగా బయల్దేరారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో నామినేషన్ సమయం దాటిపోయింది. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 వరకే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ, ఆయన పొన్నూరు మున్సిపల్ కార్యాలయానికి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో మురళీ బుధవారం నామినేషన్ వేయనున్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె నగరంలో రోడ్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు చేరుకోనున్న ఆమె సాయంత్రం సంజీవయ్యనగర్, రాజీవ్ గాంధీనగర్, శారదాకాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
➤ నియోజకవర్గం: చిలకలూరిపేట
➤ అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP)
➤ భార్య: వెంకాయమ్మ
➤ విద్యార్హతలు: B.COM
➤ చరాస్తి విలువ: రూ.32.33కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు
➤ కేసులు: 13
➤ అప్పులు: రూ.22.72కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1,55,011
➤ బంగారం: 409.8గ్రాములు, భార్యకు 323.5గ్రాముల బంగారం
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
ఎన్నికల విధుల్లో దురుసుగా ప్రవర్తించిన SI కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. మంగళవారం ఎస్సై నాగశివారెడ్డిని పర్చూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విధులకు వేశారు. ఈ సమయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు పై దురుసుగా ప్రవర్తించడంతో, సాంబశివరావు తనకు ఫిర్యాదు చేశారని దీనిపై వివరణ అడిగి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు కిటికీలు తెరిచి దోపిడీ చేస్తే వైసీపీ హయాంలో ఏకంగా తలుపులే తెరిచారని వైఎస్ షర్మిల అన్నారు. కర్లపాలెంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా చెప్పుకోవడానికి రాజధాని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ కలిసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల చేతిలో చిప్ప పెట్టారన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసలుగా తయారయ్యారన్నారు.
మహిళ మృతి చెందిన ఘటనపై మంగళవారం పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని నుంచి గుంటూరు వెళ్ళు హైవే రోడ్డుపైన గుర్తు తెలియని మహిళ పడి ఉందని గుర్తించారు. మతిస్థిమితం లేని ఆమెను గుంటూరు GGHకు తరలించారు. ఆమె పేరు లావణ్య అని చెప్పినట్లు సమాచారం. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి SST బృందాలతో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఎస్.ఎస్.టి బృందాలు నిర్వహించే విధులు కీలకమని తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.