India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆ భార్యాభర్తలు ఐపీయస్ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్‌పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్‌పీలుగా భార్య భర్తలు మల్లిక గర్గ్, వకుల్ జిందాల్‌లు. భార్యా భర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి వీడియోలను ప్రసారం చేయరాదని చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి తిరుమలరెడ్డి శనివారం తెలిపారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలను పలు టీవీ ఛానల్స్ పదే పదే ప్రసారం చేస్తున్నాయని అన్నారు. అలా చేయడం ద్వారా ప్రశాంతత నెలకొన్న గ్రామాల్లో మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలు పదే పదే ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన మలికా గర్గ్ తండ్రి సత్యేంద్ర గర్గ్ గతంలో అండమాన్ నికోబార్ దీవుల డీజీపీగా, తూర్పు ఉత్తర ప్రాంతానికి జాయింట్ సెక్రటరీగా పని చేశారు. అయితే ఆయన విధుల నిర్వహణలో భాగంగా కూతురు వివాహానికి కూడా హాజరు కాలేకపోయారు. అలాగే మలికా గర్గ్‌కు 2023లో స్కోచ్ అవార్డు లభించింది. ఎవరైనా విధుల్లో తప్పు చేస్తే ఆమె ఉపేక్షించరనే పేరు కూడా ఉంది.
కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు మాజీ కలెక్టర్ లోతేటి శివ శంకర్‌కే దక్కుతుంది. కాగా జిల్లాలో బంగారు తల్లి ద్వారా ఆడపిల్లల్లో రక్త హానత నియంత్రన, గ్రమోదయం ద్వారా ప్రతీ శుక్రవారం గ్రామాల్లో సమస్యల పరిష్కారం. SC, STల అబ్యున్నతికి నవోదయం వంటి పలు అభివృద్ది కార్యక్రమాలతో ‘పీపుల్స్ కలెక్టర్’గా పేరు సంపాదించుకున్నారు.
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపరాదని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ శనివారం తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరానికి పర్యాటకులు శనివారం పోటెత్తారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తీరంలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
ఈపూరు మండలం అరేపల్లి ముప్పాళ్లలో పిడుగుపాటుకు గురై కర్రి హనుమంతరావు (40) అనే రైతు మృతి చెందాడు. హనుమంతరావు శనివారం గేదెలను మేపేందుకు వెళ్ళినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుండగా గ్రామ సమీపంలోని నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే పిడుగుపడి హనుమంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం మాచర్ల పట్టణంలో శనివారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల జరిగిన అల్లర్ల పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను సస్పెండ్, అండ్ ట్రాన్స్ఫర్ చేసిన విషయం విదితమే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు.
పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పని చేశారు. మలికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన పోలీస్ అధికారిని.
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ ఉపాధ్యక్షుడిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా పనిచేస్తుండగా.. బదిలీపై పల్నాడుకు కలెక్టర్‌గా రానున్నారు.
Sorry, no posts matched your criteria.