Guntur

News April 19, 2024

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి షాక్

image

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు శుక్ర‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో, ముఖ్య‌మంత్రి జగన్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని సీఎం జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌లక‌రించి, వైసీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

News April 19, 2024

దాచేపల్లి వద్ద వ్యక్తి మృతదేహం లభ్యం

image

దాచేపల్లి మండల పరిధిలోని నాయుడుపేట సమీపంలో శుక్రవారం గుర్తు వ్యక్తి తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

image

గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున, ఈనెల 30వ తేదీన పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. మరమ్మతుల వల్ల గుంటూరు-మాచర్ల, మాచర్ల- నడికుడి సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పగిడిపల్లి, కాజీపేట, కొండపల్లి, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో వెళ్తుందని తెలిపారు.

News April 19, 2024

బాపట్లలో 7 ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులు నామినేషన్

image

నామినేషన్ల ప్రారంభమైన గురువారం నాడే బాపట్లలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగింది. బాపట్లలో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇరువురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రంజిత్ బాష చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయగా.. ఎంపీ అభ్యర్థులు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

News April 19, 2024

తెనాలి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

image

లంచం తీసుకుంటూ జూనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన తెనాలి పట్టణంలో జరిగింది. తెనాలి పట్టణంలోని అమరావతి కాలనీలో ఉన్న ఉడా ఆఫీసులో సిఆర్‌డిఏ ప్లాన్ అమలు చేయడానికి జూనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురి నామినేషన్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురువారం అసెంబ్లీ స్థానానికి పలువురు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున నరసరావుపేట-చదలవాడ అరవిందబాబు, మంగళగిరి- నారా లోకేశ్ ఉన్నారు. వైసీపీ తరఫున బాపట్ల- కోన రఘుపతి ఉన్నారు. పిరమిడ్ పార్టీ వినుకొండ-రమణ, పెదకూరపాడు-మల్లిఖార్జున రావు, కాంగ్రెస్ తరఫున-నాగేశ్వరరావు, జాతీయ జనసేన పార్టీ నరసరావుపేట-గోదా రమేశ్, టీడీపీ నరసరావుపేట ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలు.

News April 18, 2024

నరసరావుపేట TDP MP అభ్యర్థిగా లావు నామినేషన్

image

జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట MP స్థానానికి TDPఅభ్యర్థిగా గురువారం ఉదయం 11.20 గంటలకు లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ వేశారని అన్నారు. ఆయన మాట్లాడుతూ..
రెండు సెట్ల నామినేషన్ పత్రాలను లావు అందించారని తెలిపారు. ఎన్నికల సిబ్బంది పరిశీలించిన తరువాత నామినేషన్ స్వీకరించనున్నట్లు చెప్పారు.

News April 18, 2024

గుంటూరు: కాలువలో మృతదేహం 

image

జిల్లాలోని నగరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖిలేరు కాలవలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య గల గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, ఫ్రెంచ్ గడ్డం, సిమెంట్ కలర్ కాటన్ ప్యాంట్, ఎరుపు, నలుపు రంగు చెక్స్ చొక్కా, నలుపు రంగు బెల్ట్ ధరించి, గోల్డ్ కలర్ బకిల్ కలిగి ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.  

News April 18, 2024

బాపట్లలో సినిమా స్టూడియో ఏర్పాటు 

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సినిమా స్టూడియో ఏర్పాటు చేయబోతున్నానని ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ తెలిపారు. గురువారం బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌లో ఏర్పాటు చేయమని అక్కడ ఎంపీ అడిగినా, నా జన్మభూమి బాపట్లలోనే స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. బాపట్ల ప్రజల రుణం తీర్చుకోవాలనేది నా కోరిక అని చెప్పారు. 

News April 18, 2024

గుంటూరు జిల్లాలో నేడు నామినేషన్ వేసే అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్, నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాడు బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థిగా స్తోత్రరాణి నామినేషన్లను దాఖలు చేయనున్నారు.  

error: Content is protected !!