Guntur

News April 18, 2024

గుంటూరు: కాలువలో మునిగి విద్యార్థి మృతి

image

తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కొమ్మమూరు కాలువలో మునిగి విద్యార్థి మృతిచెందాడు. నర్సరావుపేటకు చెందిన వంశీకృష్ణ వడ్లమూడిలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తాను మరో ముగ్గురితో కలసి సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి దేవస్థానం వద్ద కాల్వకు బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈత కొడుతుండగా.. వంశీకృష్ణ మునిగిపోగా.. రాత్రికి మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

News April 18, 2024

గుంటూరు కలెక్టరేట్‌లో భద్రతా చర్యల పరిశీలన 

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి కలెక్టరేట్లో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో అభ్యర్థులకు ఏర్పాట్లు, ఇతరులు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి రాకుండా చేసిన భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. పరిశీలనలో డీఆర్‌ఓ పెద్ది. రోజా, తదితరులు పాల్గొన్నారు. 

News April 18, 2024

తెనాలి: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌నని బెదిరిస్తున్న వ్యక్తి.. కేసు నమోదు

image

పట్టణంలోని హోటల్ వ్యాపారస్థులకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హోటల్ యాజమానులకు ఫోన్ చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని వ్యాపార వర్గాలను బెదిరిస్తున్నాడు. తెనాలి హోటల్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తెనాలి 2టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశామన్నారు.  

News April 18, 2024

గుంటూరులో భారీగా నగదు, మద్యం సీజ్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలో సరైన పత్రాలు చూపని రూ రూ.80వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 17వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,19,14,430లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. 

News April 17, 2024

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

నరసరావుపేట కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులతో ఎన్నికల సన్నద్ధపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ కమిట్మెంట్‌, డెడికేషన్‌తో విధులు నిర్వహించాలన్నారు. సీ విజిల్ యాప్ అమలులో జిల్లా ముందు వరుసలో పల్నాడు జిల్లా ఉందని అన్నారు.

News April 17, 2024

పిడుగురాళ్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం పోలేరమ్మ గుడి వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుదని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. 

News April 17, 2024

గుంటూరు: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే 

image

తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షేక్ నంబూరు సుభాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా  లోకేశ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, పలువురు వైసీపీ నేతలు, మాజీ కార్పోరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్, తదితరులు పాల్గొన్నారు. 

News April 17, 2024

బొల్లాపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులబాధ తాళలేక పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన వెంకటేశ్వర్లు (44) అప్పుల బాధతో పురుగు మందు తాగి చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. వెంకటేశ్వర్లు ఏప్రిల్ 14న పురుగు మందు తాగగా.. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారన్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. రైతు మృతిచెందాడని చెప్పారు. 

News April 17, 2024

సత్తెనపల్లిలో మంత్రి అంబటి ఫొటోతో టీ కప్పులు

image

సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్‌లలో మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ల ఫొటోలతో ఉన్న టీ కప్పులు దర్శనమిస్తున్నాయి. కొందరు వైసీపీ నాయకులు తమకు ఈ కప్పులు ఇచ్చారని, టీ కొట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

News April 17, 2024

గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలివే.!

image

గుంటూరులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.73, లీటర్ డీజిల్ ధర రూ.97.56గా ఉంది. పది రోజులుగా వీటి ధరలు నిలకడగానే ఉన్నాయి. బాపట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.98 ఉండగా, డీజిల్ ధర రూ.96.85గా ఉంది. పల్నాడులో డీజిల్ ధర రూ.97.42 ఉండగా, పెట్రోల్‌ను రూ.109.60కి విక్రయిస్తున్నారు.

error: Content is protected !!