India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం అమలు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ తుషార్, ఏఎస్పీలు పాల్గొన్నారు.
ఈనెల 18 నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరిస్తున్నట్లు పల్నాడు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. నామినేషన్ల గడువు 25తో ముగుస్తుందన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అన్నారు. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి వివాహిత మృతి చెందిన ఘటన ముప్పాళ్ల మండలం తురకపాలెంలో జరిగింది. తురకపాలెం గ్రామానికి చెందిన పలువురు పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో కృపావతి (40) మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాల తరలించి, క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరులో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనపై మంగళవారం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రైల్వే స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్ ఫారంపై వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వివరాలు తెలిసిన వాళ్ళు గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల విధుల నిర్వహణకు 4600 మంది పోలింగ్ అధికారులను నియమించారు. ఇందులో సోమవారం మొదటి విడతగా 2300 మందికి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వని 45 మందికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు.
వేసవికాలం ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి మంగళ, శనివారాల్లో సికింద్రాబాద్లో బయలుదేరి సంత్రాగచి బుధ, శనివారాల్లో చేరుతుందన్నారు. తిరిగి ఈనెల 21 నుంచి జూన్ 30వ తేదీ వరకు సత్రాగచిలో ప్రతి బుధ, ఆదివారాల్లో బయలుదేరి సికింద్రాబాద్ గురు, సోమవారాల్లో చేరుతుందన్నారు.
నరసరావుపేట బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూదాల బాబురావుని నియమిస్తున్నట్లు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భక్కా పరంజ్యోతి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేటలోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా ప్రయాణించాలని అన్నారు. అన్ని వర్గాల వారు బాబురావు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు కన్నయ్య వెంగళాయపాలెం దగ్గర నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని అందులో మిర్చి పంట వేశాడు. సరైన దిగుబడి రాకపోవడం వలన తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య శాంతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాష, ఎస్పీ రకుల్ జిందాల్ చెప్పారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. రూములు వద్ద తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఈవీఎం బాక్స్‌లను తరలించడానికి వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాక్సులు తరలించేటప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.
మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని సచివాలయం-1, 2 పరిధిలోని వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పేదలకు సేవ చేయలేనప్పుడు తాము వాలంటీర్లుగా కొనసాగలేమని, అందుకే తమకు తాము రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. గ్రామంలోని 58 మంది వాలంటీర్లు రాజీనామా లేఖలను సంబంధిత అధికారులకు అందజేశారు.
Sorry, no posts matched your criteria.