India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొన్నూరు పట్టణ శివారు జీబీసీ రోడ్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ప్రశాంత్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక యువకుడు మన్సూర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పొన్నూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్లపాలెం పంచాయతీలోని 29 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఎంపీడీవో నేతాజీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామన్నారు. అలాంటి తమపై పలువురు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. అందువల్లే రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.
పలువురు టీడీపీ ముఖ్య నాయకులకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా, సత్తెనపల్లి-కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గుంటూరు వెస్ట్-తాడిశెట్టి మురళీమోహన్, నరసరావుపేట- నల్లపాటి రాములను కార్యనిర్వాహక కార్యదర్శులుగా, మాచర్ల-కళ్ళం రామాంజిరెడ్డి, పంగులూరు అంజయ్యను పార్టీ కార్యదర్శులుగా నియమించారు.
గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ సమీపంలో నిన్న జరిగిన <<13050560>>రైలు ప్రమాదం<<>>లో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం వేముల ప్రియాంకగా గుర్తించారు. ఉద్యోగరీత్యా భర్త జితేంద్రతో కలిసి జడ్చర్లలో ఉంటున్నారు. ఇటీవల భర్త తిరుపతికి వెళ్లగా ఆమె వారి బంధువులను చూసేందుకు గుంటూరు వెళ్లింది. తిరిగి జడ్చర్లకు వస్తుండగా గద్వాల వద్ద రైలు నుంచి కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
గుంటూరు నల్లకుంటకు చెందిన తొనుగుంటల సాయి రాజేశ్ (25) చిలకలూరిపేట సమీపంలోని ఓ కళాశాలలో 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 6 నెలల కిందట ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు లాల్‌పురం పొలాల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్‌ను రాష్ట్ర అధిష్ఠానం ఎన్నుకున్నట్లు కొమ్మలపాటి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, పార్టీ అభివృద్ధి గెలుపుకు కృషి చేస్తానని కొమ్మాలపాటి అన్నారు. అయితే పలువురు పార్టీ పెద్దలు అతనికి అభినందనలు తెలిపారు.
పాత గుంటూరులో ఆదివారం ఘోర ఘటన చోటుచేసుకుంది. పాతగుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు యాదవుల బజారుకు చెందిన దూళ్ళ ప్రభాకర్ (40) స్నేహితుడు పోగుల రాంబాబు వద్ద రూ.100 అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31న తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని ప్రభాకర్‌ను రాంబాబు అడిగాడు. ఈ విషయంలో గొడవ పెద్దదై రాంబాబు పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో ప్రభాకర్ తలపై కొట్టాడంతో తలలో రక్తం గడ్డకట్టి చనిపోయాడు.
పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 22న పెదకూరపాడులో నామినేషన్ వేయనున్నట్లు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. అచ్చంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆ మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్లలో చేసిన సుపరిపాలన మరో ఐదేళ్లు కొనసాగించాలంటే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలపాలని కోరారు.
తెనాలిలో చిన్న చిన్న అంగళ్లలోనూ గంజాయి ఎక్కువగా విస్తరించిందని తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ తెనాలిలో అనేక హామీలు ఇచ్చారని కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హామీ ఇచ్చారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాకి నియమించిన ఎన్నికల పరిశీలకులకు అవసరమైన వసతి, రవాణా ఇతర సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివ శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నుండి రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు తదితరులతో వెబెక్స్ ద్వారా మీటింగ్ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.