Guntur

News April 24, 2024

మంగళగిరిలో యాచకుని మృతి

image

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నారసింహుని ఆలయం ఎదుట ఉన్న కళ్యాణ గ్రౌండ్‌లో సోమవారం తెల్లవారుజామున, గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని ఇతర ప్రాంతం నుంచి వచ్చి రాత్రి సమయాల్లో ఇక్కడ నిద్రిస్తుంటాడని పోలీసులు తెలిపారు.

News April 24, 2024

చినకాకానిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని మురగన్ హోటల్ సమీపంలో సైడ్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతదేహం కుళ్ళిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. సదరు వ్యక్తి మృతి చెంది ఐదు రోజులపైనే అయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2024

పల్నాడు: ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్య

image

ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రెంటచింతల మండల పరిధిలోని తుమృకోటలో, సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కుంకలకుంట భారతి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం గ్రామానికి వచ్చారు. రాత్రి ఆరు బయట పడుకోగా తెల్లవారేసరికి హత్యకు గురైందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 22, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు YCP,TDP ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి మనోహర్ నాయుడు, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత ఉన్నారు. ప్రత్తిపాడు టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, తూర్పు మహ్మద్ నజీర్, గురజాల యరపతినేని శ్రీనివాసురావు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

గుంటూరు: నేడు నామినేషన్లు వేసే YCP అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన , ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి కే మనోహర్ నాయుడు, తాడికొండ నుంచిమేకతోటి సుచరిత వైసీపీ నుంచి నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

అనిల్ కుమార్ యాదవ్ ఆస్తుల వివరాలు

image

➤ పార్లమెంట్: నరసరావుపేట
➤ అభ్యర్థి: పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (YCP)
➤ భార్య: జాగృతి
➤ విద్యార్హతలు: B.D.S
➤ చరాస్తి విలువ: రూ.2.43 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2.10కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.1.59కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2 లక్షలు
➤ బంగారం: 12 గ్రాములు, డైమండ్ రింగ్ భార్యకు 900 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థి పేర్కొన్న వివరాలు ఇవి.

News April 22, 2024

రేపు తెనాలి రానున్న వైఎస్ షర్మిల

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మంగళవారం సాయంత్రం తెనాలి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 7గంటలకు మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News April 22, 2024

నాదెండ్ల: ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

image

నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తూబాడు చిరుమామిళ్ళ గ్రామాల మధ్యనున్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15) నీట మునిగి చనిపోయారు. నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుపోవడంతో గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

News April 22, 2024

జిల్లాలోని సమస్య ఆత్మక పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ బస

image

సార్వత్రిక ఎన్నికల 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాచర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, చెక్ పోస్టులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తత నిర్వహించాలన్నారు. మద్యం, నగదు ఇతర వస్తువులు అక్రమ రవాణాను నివారించాలని, సిబ్బందికి సలహాలు అందజేశారు. తనిఖీ అనంతరం మందడం జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేశారు.

News April 21, 2024

ANUలో ICET-2024 నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్ట్ విధానంలో 8 కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ANU- ICET-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంబీఏలో పలు రకాల కోర్సులు, ఎంసీఏ కోర్సులలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఆ విభాగ సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మే 9లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు.