Guntur

News April 12, 2024

నరసరావుపేట: ఇంటర్ ఫెయిల్ కావడంతో ఆత్మహత్య

image

నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని మనస్తాపం చెంది ఉరేసుకుంది. మృతురాలు ఇంటర్ సెకండియర్ చదువుతున్న అర్చనగా గుర్తించారు.

News April 12, 2024

గుంటూరు : గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు

image

వావిలాల గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రిన్సిపల్ డి.రాంబాబు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు కోర్సులో చేరేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు కోసం గుంటూరులోని అరండల్ పేట 12/3లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలలో మన గుంటూరు రెండో స్థానం

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 81 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.30,306 మంది పరీక్షలు రాయగా 24,536 మంది పాసయ్యారు. పల్నాడు జిల్లా 65 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. 13,651 మంది పరీక్షలు రాయగా 8,874 మంది పాసయ్యారు. బాపట్ల జిల్లా 61 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 8230 మంది పరీక్షలు రాయగా 5010 మంది పాసయ్యారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలలో మన గుంటూరు రెండో స్థానం

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 87 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. 26,007 మంది పరీక్షలు రాయగా 22,673 మంది పాసయ్యారు. పల్నాడు జిల్లా 73 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. 12,087 మంది పరీక్షలు రాయగా 8,870 మంది పాసయ్యారు. బాపట్ల జిల్లా 71 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 7995 మంది పరీక్షలు రాయగా 5709 మంది పాసయ్యారు.

News April 12, 2024

సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్

image

పిడుగురాళ్లలో సీఎం సిద్ధం సభ తర్వాత పల్నాడు రాజకీయాలు వేడెక్కాయి. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సభలో కాసు ప్రసంగిస్తూ తమ దగ్గర డబ్బుల్లేవు కానీ దమ్ముందన్నారు. దానికి యరపతినేని స్పందిస్తూ ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. దానికి కాసు తాను సిద్ధమేనంటూ ప్రతి సవాల్ విసిరారు.

News April 12, 2024

గుంటూరు వైసీపీ MP అభ్యర్థిగా విడదల రజని పోటీ ?

image

ఎలక్షన్ నోటిఫికేషన్ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలు పూర్తి చేయగా, కొందరి మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా విడదల రజని పోటీ చేస్తారని తెలుస్తోంది. గుంటూరు పశ్చిమం నుంచి కిలారి రోశయ్యను బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

News April 12, 2024

నేటి సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్

image

CM జగన్ మేమంతా సిద్ధం శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 9:00 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయలుదేరి సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా మధ్యాహ్నం హౌసింగ్ బోర్డుకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు బైపాస్‌కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

News April 12, 2024

సామాజిక సంస్కరణల రూపకర్త ఫూలే: కలెక్టర్

image

సామాజిక సంస్కరణల రూపకర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు పాల్గొని ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని కొనియాడారు.

News April 11, 2024

గుంటూరు వచ్చే పలు రైళ్లు రద్దు

image

ఇంజనీరింగ్ పనుల నిమిత్తం నేటి నుంచి 30వ తేదీ వరకు విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465, గుంటూరు – విజయవాడ 07976 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హుబ్లీ – విజయవాడ 17329 రైలుని ఈ నెల 29 వరకు, విజయవాడ – హుబ్లీ 17330 రైలును ఈ నెల 30 వరకు విజయవాడ – గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.

News April 11, 2024

గుంటూరు మిర్చియార్డుకు నేడు సెలవు

image

రంజాన్ పండుగ సందర్భంగా గురువారం మిర్చియార్డుకు సెలవు ప్రకటించారు. ఎటువంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని యార్డుకు మిర్చి తీసుకురావద్దని ఇన్‌ఛార్జ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా మిర్చి విక్రయాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతులు బుధవారం 1,04,430 బస్తాలు యార్డుకు తరలించగా, అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 85,482 బస్తాలు నిల్వ ఉన్నాయి.

error: Content is protected !!