Guntur

News May 12, 2024

గుంటూరు: రైళ్లకు అదనపు బోగీలు

image

ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు కాచిగూడ- గుంటూరు, కాచిగూడ-రేపల్లె, 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రేపల్లె-సికింద్రాబాద్ రైళ్లకు అదనపు బోగీలు ఉంటాయన్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్-రేపల్లె రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 12, 2024

ప్రయాణికుల రద్దీతో గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును, గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. నేడు సికింద్రాబాద్‌లో 19.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు సత్తెనపల్లి, గుంటూరు, విశాఖపట్నం 06.30 గంటలకు చేరుతుందన్నారు. అయితే పలు రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 12, 2024

సినీ రచయిత కోన వెంకట్ పై కేసు నమోదు

image

ప్రముఖ సినీ <<13231508>>రచయిత కోన వెంకట్ పై<<>> కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. శనివారం కర్లపాలెం మండలంకు చెందిన ఓ రాజకీయ కార్యకర్తపై దాడి చేశారన్న ఆరోపణతో ఆయనతోపాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశామన్నారు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఘటనకు పరోక్షంగా కారణమైన ఎస్సై పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

News May 12, 2024

కర్లపాలెం ఎస్సై జనార్దన్ సస్పెన్షన్

image

కర్లపాలెం <<13230471>>ఎస్సై జనార్దన్‌ను సస్పెండ్<<>> చేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడి విషయంలో ఘటనకు ఎస్సై పరోక్షంగా కారణమయ్యాడనే నెపంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలీస్ సిబ్బంది ప్రవర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 12, 2024

గుంటూరు : 1915 పోలింగ్ కేంద్రాలు.. 13,800 మంది ఉద్యోగులు

image

జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 1915 కేంద్రాలలో పోలింగ్ విధులకు 13,800 మంది ఉద్యోగులను విధులకు కేటాయించినట్టు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్‌తో కలిసి సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రిజర్వ్ సిబ్బందితో కలిపి పీవోలుగా 2300 మంది, ఏపీవోలుగా 2300 మంది, ఓపిఓలుగా 9,200 మంది కలిపి మొత్తం 13,800 మంది సిబ్బందిని కేటాయించామన్నారు.

News May 11, 2024

గల్లా మాధవిపై ఫేక్ ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ నాయకులు బి.వి రామాంజనేయులు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులాలు, మతాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News May 11, 2024

గుంటూరు: పంపిణీకి ఈవీఎంలు సిద్ధం

image

ఈనెల 13వ తేదీన నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలు, వివి ప్యాట్లను అధికారులు పంపిణీకి సిద్ధం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంకు ఈవీఎం, వివి ప్యాడ్ ఇతర సామాగ్రిని ఒక ప్రత్యేక బ్యాగులో ఏర్పాటు చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని పంపిణీ కేంద్రాలను గుంటూరు పశ్చిమ రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి శనివారం పరిశీలించారు. పశ్చిమ పరిధిలోని 292 పోలింగ్ కేంద్రాలకు ఆదివారం ఈవీఎంల పంపిణీ చేస్తామన్నారు.

News May 11, 2024

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

నేటి సాయంత్రం 6:00 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా.. 144 సెక్షన్ విధిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతోటి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరూ కూడా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News May 11, 2024

గుంటూరు: ప్రచారం CLOSE

image

ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు దాదాపు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది. ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.

News May 11, 2024

మంగళగిరి ప్రజలకు బహిరంగలేఖ: నారా లోకేశ్

image

మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ బహిరంగ లేఖను శనివారం రాశారు. మంగళగిరి ప్రజలపై లోకేశ్‌కు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ లేఖలో తెలియజేశారు. జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైలులో పెట్టినపుడు.. మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడ్డానంటే కారణం నా బలం, బలగమైన మంగళగిరి ప్రజలేనని తెలిపారు.