India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: మురుగుడు లావణ్య (YCP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.42.54 లక్షలు
➤ భర్త చరాస్తి విలువ: రూ.85.01 లక్షలు
➤ బంగారం: 450 గ్రాములు, భర్త పేరుతో 100 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి
గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం పలువురు నామినేషన్ దాఖలు చేశారు. షేక్ నూరి ఫాతిమా(YCP), గూడవల్లి మణికుమారి (బహుజన్ సమాజ్ పార్టీ), షేక్ రజాక్ (నవతరం పార్టీ), షేక్ దుర్రే షహవర్ (స్వతంత్ర), కాజా రాఘవేంద్ర సంజీవరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా). గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి రోశయ్య (వైసీపీ), షేక్ అస్లాం అక్తర్(స్వతంత్ర), అక్కిశెట్టి శ్రీకృష్ణ (స్వంతత్ర) అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి ఓటు హక్కు మిస్ అవ్వకుండా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో అత్యవసర శాఖల పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 5,6,7 తేదీలలో పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
గుంటూరులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి పలకలూరు వెళ్లే రోడ్డులో శుక్రవారం రాత్రి ఒక కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో శుక్రవారం ప్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీలలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ.3,20,700లు, తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.1.91లక్షల నగదు పట్టుబడింది. గుంటూరు పశ్చిమలో 2,280 విలువ గల 3.06లీటర్ల లిక్కర్‌ని స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరిగిన తనిఖీలలో శుక్రవారం వరకు రూ.2,24,28,410ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
రానున్న సౌత్ వెస్ట్ మాన్సూన్ నాటికి వచ్చే వర్షం నీటిని ఫామ్ పాండ్‌లో ఒడిసి పట్టడంలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ శివశంకర్‌లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంటో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా రెంటచింతల మండలానికి చెందిన డేగల మహేశ్‌ను నిమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలోని కార్యాలయంలో శుక్రవాం మహేశ్‌కు అందజేశారు. మహేశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా పదవి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించి, వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
దాచేపల్లి మండల పరిధిలోని నాయుడుపేట సమీపంలో శుక్రవారం గుర్తు వ్యక్తి తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున, ఈనెల 30వ తేదీన పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. మరమ్మతుల వల్ల గుంటూరు-మాచర్ల, మాచర్ల- నడికుడి సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పగిడిపల్లి, కాజీపేట, కొండపల్లి, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో వెళ్తుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.