India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించాల్సిన మాచర్ల పర్యటన రద్దయినట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు అక్కడ భారీ వర్షం కురవడంతో ఆలస్యమైంది. దీంతో నావిగేషన్ అధికారులు మాచర్ల నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో అనుమతులు నిరాకరించారు. బాబు సభ కోసం తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు నిరుత్సాహ పడ్డారు.
మంగళగిరిలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ వస్త్ర వ్యాపారి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ నివాసం నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా అధికారులు విచారిస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు నగదు, రూ. 25 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, ఎఫ్‌డీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
చిలకలూరిపేటలో శనివారం సీఎం జగన్ పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. స్థానిక కళామందిర్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సభలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని సీఎం కోరనున్నారు. గత ఎన్నికల్లో కళామందిర్ సెంటర్‌లో సభ విజయవంతమై విడదల రజిని ఎమ్మెల్యేగా గెలవడంతో సెంటిమెంట్‌గా అదే సెంటర్‌లో సభ నిర్వహించనున్నారు.
గుంటూరులోని ఓ హోటల్లో దోశలో ఇనుప బోల్ట్ రావడంతో ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. గురువారం ఓ వ్యక్తి మిత్రులతో కలిసి కొరిటెపాడులోని ఓ హోటల్‌కు వెళ్లారు. దోశ ఆర్డర్ చేసి తింటుండగా అందులో ఇనుప బోల్ట్ వచ్చింది. ఈ విషయం హోటల్ నిర్వాహకులను అడిగితే పట్టించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఆహార భద్రత నియంత్రణ శాఖ అధికారులకు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ శుక్రవారం మంగళగిరికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ప్రదేశాన్ని ఎమ్మెల్యే ఆర్కే, పోలీస్ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం కోసం నిడమర్రు రోడ్డు, రైలుగేటు వద్ద గల స్థలాలను పరిశీలించారు.
జిల్లాలో గురువారం ప్లయింగ్ స్క్వాడ్‌లు నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.42,500/-ల నగదు, మంగళగిరి పరిధిలో రూ.87,500/ల నగదు, గుంటూరు తూర్పు పరిధిలో రూ. 2,96,500 ల నగదు, తాడికొండ పరిధిలో రూ.35,000ల విలువ గల వస్తువులు సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఇప్పటి వరకు రూ.3,64,11,311/ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.
వెయ్యి మంది ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లలో లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంబంధించి ఖర్చుల బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్ట్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామన్నారు. జిల్లాలో 68 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.
మండలంలోని తిప్పలకట్ట దగ్గర కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం దొరికినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కృష్ణానదిలో సుమారు 70ఏళ్ల వయస్సు ఉన్న మగ శవం వుండటంతో వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు దేహాన్ని పోలీస్ స్టేషన్‌లో తెలపాలని ఎస్సై వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగాఈ నెల 12 ,13 రెండు రోజులు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీ చేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధృువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పత్రికల యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ముందస్తు అనుమతి లేకుండా తమ పత్రికలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.
Sorry, no posts matched your criteria.