India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యాహక్కుచట్టం-2009 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశం పొందటానికి ఆన్లైన్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో శైలజ ఆదివారం తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అప్పులు తీర్చినా మరింత చెల్లించాలంటూ, రుణదాతలు వేధిస్తున్నారని కొత్తపేటలోని మెడికల్ ల్యాబ్‌లో పనిచేసే కూరాకుల శివప్రసాద్(38) అనే వ్యక్తి వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో చూసిన మిత్రులు అక్కడికి చేరుకుని అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలక్టరేట్‌లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కో ఆర్డినేషన్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగం, సువిధ పోర్టల్ విభాగాన్ని అందుబాటులో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులు గురించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
నవ యువతరం ఫౌండేషన్ సేవాసంస్థ అధినేత, ఫౌండర్ చిగుళ్ల సుమలతను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించారు. సేవా సంస్థ ద్వారా సమాజానికి అందించిన సేవలకు, వివిధ రంగాలలో కనపరిచిన ప్రతిభను చూసి ఆమెకు ఉమెన్స్ వరల్డ్ రికార్డ్సు అండ్ అవార్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉత్తరప్రదేశ్ ఉమెన్ ఐకాన్-2024 అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మెరుగైన సేవలు ఇంకా సమాజానికి అందించాలని కలెక్టర్ అన్నారు.
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన దొప్పలపూడి రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దొప్పలపూడి రాజేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోటు రాసి మరణించాడు.
కారంపూడి మండలంలోని కారంపూజీ-2లో వాలంటీర్‌గా పని చేస్తున్న షేక్. మజూజి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫొటోలు, వీడియోలు స్టేటస్‌గా పెట్టడం వల్ల, అతడ్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని శనివారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో, భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిరంగిపురంలో వీవీ ప్యాట్‌లను కూడా పరిశీలించారు.
గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మంగళగిరిలో అసెంబ్లీకి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా, తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.లక్ష్మయ్యకు వచ్చిన మెజార్టీ(17,265)నే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఈ మెజార్టీని దాటలేకపోయారు. 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల మెజార్టీ ఇక్కడ అత్యల్పం. ఈసారి మంగళగిరి ఎన్నికల బరిలో నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.