India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్‌కి వినతిపత్రం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్‌ని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై చేపట్టిన చర్యలపై పవన్‌తో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.

ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు కావలసిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. మంగళవారం చిలకలూరిపేట టౌను, రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

2013లో బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో హోంగార్డుపై కత్తితో దాడి చేసిన ఘటనలో, ఇరువురికి న్యాయస్థానం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఓ కేసు విషయంలో వారిన అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన హోంగార్డుపై వారు కత్తులతో దాడి చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వాణికుమారి వారికి శిక్ష విధించినట్లు తెలిపారు.

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం సుమారు ఏ/సి 75,000 బస్తాలు చేరాయి. కేజీల వారీగా సీడు రకాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.160 నుంచి 195, సూపర్ డీలక్స్ రూ.200, 341 బెస్ట్ రూ.140 నుండి రూ.175, సిజెంటా బెడిగి రూ.110, రూ.145, 2043 బెడిగి రూ.140, రూ.180, డిడి రకం రూ.130, రూ.170, నంబర్ 5 రూ.140, రూ.175, బుల్లెట్ రూ.110, రూ.170, ఆర్మూర్ రకం రూ.120, రూ.155, రోమి రకం రూ.120, రూ.160 వరకు ధర ఉంది.

మాజీ సీఎం జగన్‌కు విజయవాడ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా ? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలకు వెళ్దాం. నీకు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, అసలు గెలుస్తావో లేదో చూద్దాం. ఇకనైనా నీ చిలక జోస్యం ఆపు’ అని Xలో పోస్ట్ చేశారు.

తనను కలవడానికి వచ్చే వారు శాలువాలు, పూలదండలు, బొకేలు తీసుకురావొద్దని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో ఎవరైనా ఏదైనా తీసుకురావాలనుకుంటే.. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు తీసుకొస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

మంగళగిరికి చెందిన క్రీడాకారిణి జెస్సీరాజ్(13) ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో మెరిసింది. న్యూజిలాండ్‌లో ఈ నెల 13 నుంచి జరుగుతున్న పోటీల్లో భారత్ జట్టు తరఫున ప్రీ స్టైల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి థామస్ చౌదరి తెలిపారు. 17 దేశాల క్రీడాకారులు పోటీ పడగా.. జెస్సీ రాజ్ 31.98 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నకరికల్లు మండలంలో సోమవారం వెలుగుచూసింది. నకరికల్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(62) ఇద్దరు బాలికలకు మాయ మాటలు చెప్పి, 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ బాలిక కడుపు నొప్పితో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.