India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వట్టిచెరుకూరు మండలం తాళ్లపాడు గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ శివన్నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. ఆవిరేణి కుంట తాండ గ్రామ సమీపంలో పొక్లెయిన్ విధులు నిర్వహిస్తున్న శివ నారాయణ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆ వాహనానికే ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న కృష్ణా జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో పలు రాజకీయం అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని లోకేశ్ సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు.

లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించిన ఘటన రాజుపాలెం సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. రాజుపాలెం- బెల్లంకొండ రహదారిపై ఒక్కసారిగా లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవరు వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఘర్షణ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాత వంతెనలు, అధ్వాన రహదారులు, మలుపులు, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చందోలు, యాజలి, బుద్దాం, కర్లపాలెం వద్దగత రెండున్నరేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందారు. బాపట్ల మండలంలో వెదుళ్లపల్లి-పర్చూరు రహదారిలో పేరలి వంతెన రక్షణ గోడలు పూర్తిగా కూలగా.. 2022 నవంబర్‌లో ఈ మలుపు వద్ద ఐదుగురు అయ్యప్ప దీక్షదారులు మృత్యువాతపడ్డారు.

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొత్త తరహా సైబర్ మోసాలతో తక్కువ సమయంలో నగదు సంపాదించాలని నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట టెలిగ్రామ్‌లో లింక్ పంపి క్లిక్ చేయగానే రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

ఈపూరు మండలంలోని కొండ్రముట్ల రైతు భరోసా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి రైతు భరోసా కేంద్రం తాళాలు పగులగొట్టి, కంప్యూటర్, టీవీలను చోరీ చేశారు. ఆదివారం ఉదయం అటువైపు వెళుతున్న రైతు ఒకరు రైతు భరోసా కేంద్రం తెరిచి ఉండటం చూసి వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయశాఖ ఏవో రామినేని రామారావు తెలిపారు.

వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాపైన వ్యక్తిని పోలీసులు వికారాబాద్‌లో రక్షించారు. గచ్చిబౌలి SI వివరాల ప్రకారం .. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన చదలవాడ సాయి గుప్తా(35) కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. గౌతమ్ అనే వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. గౌతమ్ ఇచ్చిన డబ్బుకు ఆధారాలు లేకపోవడంతో కిడ్నాప్ చేసైనా దొంగ డాక్యుమెంట్లు రాయించుకోవాలని సాయిని కిడ్నాప్ చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.

లాలాపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సహాయ కమిషనర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 17వ తేదీ అంకురారోపణ, 18వ తేదీ మోహిని అలంకారం, 19వ తేదీ దశావతారం, 20వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు. 21న రథోత్సవం, 22న పూర్ణాహుతి, 23న బలిహరణ కార్యక్రమాలు జరుగనున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.