India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉస్మాన్ కాంగ్రెస్‌ను, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చందు సాంబశివరావు బీజేపీని వీడారు. వీరు సీఎం జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఉస్మాన్, సాంబశివరావులను వైసీపీలోకి ఆహ్వానించారు.
పెదకూరపాడు మండలం లింగంగుంట్లలో పంటకాల్వ తవ్వుతూ పనిచేసే ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. లింగంగుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఎనుబర్ల బాబు(50) లింగంగుంట్ల-పెదకూరపాడు మార్గంలో కందకం తవ్వకం పనులకు వెళ్లి రెండు గజాలు మట్టి తవ్వి ఎండవేడికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు పెదకూరపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తెనాలి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి వస్తారని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో అనారోగ్యం వలన పవన్ తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
తెనాలి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి వస్తారని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో అనారోగ్యం వలన పవన్ తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
మాచర్ల మండల పరిధిలోని కంభంపాడులో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈర్ల మహేందర్ నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజు ప్రారంభమైంది. నంబూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ కాజ టోల్ గేట్, ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. నేడు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి బీజేపీ తరఫున ఈయన ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే టీడీపీ అభ్యర్థికి సీటు కేటాయించడంతో బీజేపీకి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులకు తగిన ప్రాధాన్యం లేదని గతంలో ఆయన చెప్పారు.
ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గుంటూరు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
తాగునీటి చెరువులను నాగర్జున సాగర్ కుడి కాలువ, కృష్ణ వెస్ట్రన్ డెల్టా కాలువకు విడుదల చేసిన నీటి ద్వారా 100% నింపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో తాగునీటి సరఫరాపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటే ముందుగానే తెలియజేయాలన్నారు.
నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని మనస్తాపం చెంది ఉరేసుకుంది. మృతురాలు ఇంటర్ సెకండియర్ చదువుతున్న అర్చనగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.