India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ప్రకటించిన ఉమ్మడి గుంటూరు జిల్లా MLA అభ్యర్థుల జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. గుంటూరు వెస్ట్- విడదల రజిని.. గుంటూరు ఈస్ట్- నూరి ఫాతిమా.. తాడికొండ- మేకతోటి సుచరిత.. మంగళగిరి- మురుగుడు లావణ్యలకు టికెట్లు కేటాయించారు. రజిని చిలకలూరి పేట నుంచి గుంటూరుకు, సుచరిత ప్రత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు. లావణ్య, నూరిఫాతిమా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు చేస్తూ, పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గుంటూరు- సికింద్రాబాద్- గుంటూరు (17253/ 17254) రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు గుంటూరు-డోన్ (17228), ఈనెల 27 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు డోన్-గుంటూరు (17227) రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బందోబస్తు నిర్వహణకు 216 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థులు కేంద్రాలకు వచ్చి వెళ్లటానికి ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. 216 మంది ఏఎన్ఎంలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ పై ఉన్న మమత, గుణశేఖర్‌ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై, ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌ను నేడు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పోలీస్ కార్యాలయానికి ప్రజలు రావద్దని కోరారు.
నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
గుంటూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం 8,785 మంది హాజరయ్యారు. 6,254 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 8,714 మంది హాజరయ్యారు. 6,325 మంది గైర్హజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.