India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ ప్రసంగించగా.. ఆ సమయంలో మోదీ, చంద్రబాబు ముచ్చటించారు. వారిరువురి మధ్య నవ్వులు విరియడంతో సభకు వచ్చిన వారిలో జోష్ కనిపించింది.
పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు DEO వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడనని అన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 29,243మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకోవాలన్నారు.
మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధానమంత్రి మోదీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన చిలకలూరిపేట మండలం బొప్పూడి సభకు చేరుకుంటారు. సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే హెలీ ప్యాడ్ ఉంది. మోదీ సభ వద్దకు సులభతరంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల నివేదికల సమర్పణ సి.విజిల్, సువిదయాప్, తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఆదివారం కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన యాప్‌లు ఏవీ ఎలా మానిటర్ చేయాలని సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ విభాగంలో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వారికి నిర్దేశించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు.
చిలకలూరిపేట టీడీపీ కూటమి సభపై YCP సెటైరికల్ ట్వీట్ చేసింది. 2014లో ఈ 3 పార్టీలు 650 హామీలు ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోను అటకెక్కించాయని పేర్కొంది. ఇప్పుడు అవే పార్టీలు అధికార దాహం కోసం ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. మళ్లీ మేనిఫెస్టోతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది.
ఒక వృద్ధుడు మృతి చెందిన ఘటనపై ఆదివారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అన్వర్ భాషా తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 12వ తేదీన 50 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. అతని పేరు వివరాలు తెలియలేదని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వృద్ధుడి గురించి తెలిసిన వాళ్ళు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.
చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద నేడు జరగనున్న TDP కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు PM మోదీ హజరవుతుండగా, పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ సాయంత్రం 4.10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7కు హైదరాబాద్ వెళతారు.
చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల మండల పరిధిలోని కొత్తపాలెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.