India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్ సీఎం అయ్యాక ఈనెల 8న తొలిసారి గురజాల నియోజకవర్గానికి వస్తుండటంతో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేమంతా సిద్ధం సభకు పిడుగురాళ్ల సమీపంలో హైవే వద్ద సభా స్థలాన్ని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. 2019 ఎన్నికల తర్వాత తొలిసారి వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సమాయాత్తం అవుతున్నాయి.
వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. ఆయన టీడీపీలో చేరుతున్నట్లు నిన్న సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, శుక్రవారం సాయంత్రం మంత్రి అంబటి రాంబాబు డొక్కా నివాసానికి వచ్చి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ అభ్యర్థుల జాబితాలో డొక్కా పేరు లేని విషయం తెలిసిందే.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్, కంట్రోల్ రూమ్ విభాగాలను శుక్రవారం ఎస్పీ తుషార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు ఐటి కోర్ బృందంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. డయల్ 100కు కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేయాలన్నారు.
పల్నాడు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఈ ఉష్ణోగ్రత నమోదవుతుందని మే 15 నుంచి 25 నాటికి ఉష్ణోగ్రతలు ఇక్కడ 50 డిగ్రీలకు మించుతుందని ఈ సంవత్సరం ఇప్పుడే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోహిణి కార్తెలో ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో పర్యటించనున్నారు. అక్కడ ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన షెడ్యూల్‌ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 2.55 గంటలకు చంద్రబాబు క్రోసూరు పశువుల ఆసుపత్రి వెనుక ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటున్నారు. 3 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 3.10కి క్రోసూరులోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద సభలో ప్రసంగిస్తారు.
విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన శీలం శ్రీను (50) ఉదయాన్నే రైట్ కెనాల్ పక్కనే ఉన్న మరసకుంట వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పొలానికి నీరు పెట్టే విద్యుత్ మోటారు వైరు తగిలి కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వినుకొండ పట్టణంలో ఏప్రిల్ 8 న జరగనున్న ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో సీఎం జగన్ పొల్గొననున్నారని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు, అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రారంభమైన మేమంతా సభ తర్వాత గురజాలలో జరుగుతుందని తెలిపారు.
గుంటూరు నగర శివారు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో గుంటూరు నల్లపాడు గ్రామానికి చెందిన కరణం శేషా సాయి (28) మృతి చెందాడు. మరొక ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు తెలిపారు. గుంటూరు నుంచి వంకాయలపాడు స్పైసెస్ పార్కుకు మినీ ట్రావెల్ బస్సులో సిబ్బంది వెళ్తుండగా.. బస్సు అదుపుతప్పి బోల్తా పడ్డట్టు సమాచారం .పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గుంటూరు అమ్మాయికి బెల్జియం అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గుంటూరు శివారు లాల్ పురానికి చెందిన పుష్పలత హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ. ప్రాజెక్ట్ పనిపై బెల్జియం వెళ్లారు. అక్కడ ప్రాజెక్టులో పని చేస్తున్న బెల్జియంకు చెందిన క్రిష్ పోలేంటితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గుంటూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.
గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు వచ్చాయి. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారు. శని, ఆది వారాలు వారాంతపు సెలవులు కావడంతో క్రయవిక్రయాలు జరగవు.వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజుల పాటు క్రయవి క్రయాలు జరగవని, సోమవారం యథావిధిగా విక్రయాలు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.