India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితా లో స్థానం దక్కినట్లు సమాచారం. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకోవడం గ్రేట్ అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

అరుణాచలంలో జూన్ 22న పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ మహోత్సవాలకు గుంటూరు 2 డిపో నుంచి స్పెషల్ బస్ ఏర్పాటు చేశామని DM అబ్దుల్ సలాం శనివారం తెలిపారు. ఈ బస్ జూన్ 20న రాత్రి గుంటూరులో బయలు దేరి, 21న శ్రీకాళహస్తి, కాణిపాకం, 22న ఉదయం అరుణాచలం చేరుతుందన్నారు. స్వామిని దర్శించుకుని 22వ తారీకు సాయంత్రం అరుణాచలంలో బయలు దేరి 23 ఉదయం గుంటూరు చేరుకుంటారన్నారు.

బాపట్ల- గుంటూరు రహదారిలో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ<<13403251>> యువకుడు మృతి చెందాడు. <<>>బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. అంకమ్మరావు అనే యువకుడు కొత్త బైక్ కొనడానికి పొన్నూరు వెళ్తుండగా స్నేహితుడు బైక్ నడుపుతూ చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో వెనక కూర్చున్న అంకమ్మరావుకు తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోశయ్య బరిలో నిలవగా.. పెమ్మసాని 2,82,085 ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA ఎమ్మెల్యే అభ్యర్థుల(857213) కంటే.. ఎంపీ అభ్యర్థికి(864948) ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మంగళగిరిలో రెండింటి మధ్య 4775 ఓట్ల వ్యత్యాసం కనిపించింది.

రామోజీ సంస్థల అధినేత, ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు ఆకస్మిక మరణం పత్రికా రంగానికి తీరని లోటని తెలుగు బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మీడియాతో పాటు వివిధ రంగాల్లో రామోజీ సేవలు మరువలేనివి అని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-ఔరంగాబాద్- గుంటూరు మధ్య రైలును ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ద.మ. రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఔరంగాబాద్ 13.20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17254) ఔరంగాబాద్‌లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటి రోజు 21.30 గంటలకు చేరుతుంది.

సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.

మండలంలోని చిలువూరుకి చెందిన టీడీపీ కార్యకర్త ఖాసిం(24) హత్య కేసులో నిందితులుగా ఉన్న తుమ్మపూడికి చెందిన నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు దుగ్గిరాల ఎస్‌ఐ బి.మహేంద్ర తెలిపారు. హర్షవర్ధన్, హృదయరాజు, కమల తేజ, రవీంద్రబాబులకు తెనాలి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. టీడీపీ గెలిచిందని సంతోషంలో ఉన్న ఖాసిం తలపై 4న బ్యాట్‌తో దాడి చేయగా, శుక్రవారం మరణించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ తుషార్ శుక్రవారం ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతE చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ జైత్రయాత్రలో భాగస్వామి అయినందుకు యువ సినీ హీరో, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అల్లుడు సిద్ధార్థ్ నిఖిల్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. శుక్రవారం మాలకొండయ్యతో కలిసి నిఖిల్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో లోకేశ్ సరదాగా ముచ్చటించారు. సినిమాల్లో హీరో మాదిరే రియల్‌గా ప్రజలకు మేలు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.