Guntur

News June 6, 2024

తాడేపల్లి: చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

తాజా ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్న చంద్రబాబుకు పోలీసులు భద్రతను పెంచారు. తాడేపల్లి (M) ఉండవల్లి గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తూ భద్రతను మరింత పెంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

News June 6, 2024

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల రాష్ట్ర సిలబస్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజాంపట్నం గురుకులపాఠశాల కన్వీనర్ వై. నాగమల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. నక్షత్రనగర్, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, వినుకొండ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

News June 6, 2024

గుంటూరు ఇండిపెండెంట్ MP అభ్యర్థికి 172 ఓట్లు

image

గుంటూరు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఎం. నాగరాజుకు కేవలం 172 ఓట్లు వచ్చాయి. ఈయనతో పోలిస్తే నోటాకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ(7387)గా ఉన్నాయి. మరోవైపు, మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థికి 8,637 వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు పోల్ అయ్యాయి.

News June 6, 2024

గుంటూరు జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి.?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన గెలుపొందాయి. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ నేతలు లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి, యరపతినేని, జూలకంటి, గల్లా మాధవి, అనగాని, తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వైసీపీ హయంలో అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.

News June 6, 2024

పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి?

image

గుంటూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ(3,44,695)తో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపెనీలు అవసరమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పెమ్మసాని కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి ఉపయోగం అని వారు అంటున్నారు. దీంతో పెమ్మసాని పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

News June 6, 2024

ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయం: ఎస్పీ

image

గుంటూరు జిల్లా ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయమని ఎస్పీ తుషార్ తెలిపారు. బుధవారం ఆయన గుంటూరులోని కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి, పోలింగ్ తర్వాత కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, కేంద్ర బలగాలకు, ఇతర శాఖల అధికారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

News June 5, 2024

పల్నాడు: మామపై 21 వేల మెజారిటీతో గెలిచిన అల్లుడు

image

పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్ రావుపై ఆయన అల్లుడు భాష్యం ప్రవీణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. శంకర్ రావు అన్నయ్య కూతురిని భాష్యం ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ అవుతారు. కాగా మామ నంబూరు శంకర్ రావుపై 21,089 ఓట్ల మెజారిటీతో భాష్యం ప్రవీణ్ విజయం సాధించి సత్తా చాటాడు.

News June 5, 2024

ఈనెల 9వ తేదీ వరకు మాచవరంలో 144 సెక్షన్ 

image

మాచవరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మాచవరం ఎస్సై అమిరుద్దీన్ బుధవారం తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని పిన్నెల్లి, కొత్త గణేషన్‌పాడు గ్రామాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు.

News June 5, 2024

నరసరావుపేటలో పనిచేయని నెల్లూరు సెంటిమెంట్

image

నరసరావుపేట లోక్ సభ ఎన్నికలలో ఈసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేయలేదు. 1999, 2004లో నెల్లూరుకు చెందిన నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి ఎంపీలుగా గెలిచారు. అదే సెంటిమెంట్‌తో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోనికి దించింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణ దేవరాయలు ఈ దఫా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.

News June 5, 2024

గుంటూరు పార్లమెంటులో తొలిసారి 60.68 శాతంతో విజయం

image

గుంటూరు ఎంపీ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4,205 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు. అయితే 2024లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని.. రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పెమ్మసానికి 60.68 శాతంతో భారీ మెజారిటీ సాధించారు.