Guntur

News April 1, 2024

గుంటూరులో బాలుడిపై పోక్సో కేసు నమోదు

image

గుంటూరులో ఓ బాలుడిపై ఆదివారం నగరంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఓ బాలుడు గుంటూరులోని వసతి గృహంలో ఉంటూ చదువుతున్నాడు. అదే వసతి గృహంలో చదువుకుంటున్న బాలిక కొద్ది రోజుల క్రితం నుంచి కనిపించడంలేదు. బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుపై CI లోకనాథం పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

News April 1, 2024

వినుకొండ: మరిగే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

image

నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మరిగే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వినుకొండలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో లుంగీ కట్టుకొని నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.

News April 1, 2024

హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన బాపట్ల ఎస్పీ

image

ఏ.ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన కె.వి. సుబ్రహ్మణ్యంని ఆదివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సన్మానించారు. అనంతరం 40 సంవత్సరాల పాటు వివిధ విభాగాలలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందించి పదవి విరమణ పొందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.వి. సుబ్రహ్మణ్యంని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు వారి కుటుంబసభ్యుల సమక్షంలో దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

News March 31, 2024

బాపట్ల: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాపట్ల పట్టణంలోని గుంటూరు రహదారిలో గల ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన సదరు వ్యక్తి చంద్రబాబు సభకు వెళుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు.

News March 31, 2024

బాపట్ల చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

image

ప్రజల యాత్రలో భాగంగా ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాపట్ల చేరుకున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తరలివచ్చారు. బాపట్లకు చేరుకున్న ఆయనకు బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు.

News March 31, 2024

తెనాలి వద్ద మృతదేహం కలకలం

image

తెనాలి మండలం సంగం జాగర్లమూడి సమీపంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగం జాగర్లమూడి రోడ్డు పక్కన సుమారు 30 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 31, 2024

వాలంటీర్లను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు: లోకేశ్

image

తాడేపల్లి మండలం కుంచనపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సమావేశమయ్యారు. నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను పటిష్ఠం చేసి, మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని అన్నారు.

News March 31, 2024

సాక్ష్యం యాప్ పై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులైన ఓటర్లు వచ్చేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఓటు హక్కు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ హెల్ప్ లైన్ డెస్క్, బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ షీట్, సహాయకుడిని అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ విధానంపై రూపొందించిన సాక్ష్యం యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు.

News March 31, 2024

గుంటూరు: టీడీపీలోకి ఎమ్మెల్సీ జంగా

image

జిల్లాలో రాజకీయ సమీకరణ చేరనున్న ఎమ్మెల్సీలు మారుతున్నాయి. వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు గురజాల నియోజకవర్గంలోని పలువురు నేతలు వైసీపీని వీడి జంగాతో టీడీపీలో చేరనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం జరగనున్న పర్యటనలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

News March 31, 2024

నేడు బాపట్లకు రానున్న చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం బాపట్ల పట్టణానికి వస్తున్నారు. మార్కాపురం నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల నుంచి సాయంత్రం 5.40 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహ కూడలి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అంబేడ్కర్ విగ్రహ కూడలిలో రాత్రి 6 గంటలకు ప్రచార సభలో ప్రసంగిస్తారు. రాత్రి బాపట్లలోనే చంద్రబాబు బస చేస్తారు.