Guntur

News March 21, 2024

బాపట్ల: ఆంగ్ల పరీక్షకు 95 శాతం హాజరు

image

పదో తరగతి ఆంగ్ల పరీక్షకు జిల్లాలో 108 కేంద్రాల్లో 16,952 మంది హాజరు కావాల్సి ఉంది. అందులో 16,424 హాజరు కాగా 528 మంది గైరాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అద్దంకి, చీరాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 28కేంద్రాల్లో విద్యార్థులను తనిఖీ చేశారు. 

News March 21, 2024

ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు  జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 0863-2234301 నంబరుకు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు. 

News March 21, 2024

పిడుగురాళ్ల: రైలు కింద పడి మహిళ మృతి

image

రైలు కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం మాచర్ల ప్యాసింజర్ రైలు వస్తున్న సమయంలో గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 21, 2024

గుంటూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులపై కేసు నమోదు

image

గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ, వైసీపీ శ్రేణులపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరేష్ వివరాలు మేరకు.. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ ఇంటి వద్ద వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోవడానికి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలపై 2 పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

News March 21, 2024

దాడులు, భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు: ఎస్పీ తుషార్

image

ఎన్నికల సమయంలో ఎవరైనా దాడులకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ బుధవారం తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్టు సమాచారం ఉంటే ప్రత్యక్షంగా చర్యలు పాల్పడొద్దన్నారు. సిటిజన్ యాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్లు లేదా దగ్గర్లోని పోలీసులు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేకానీ ఎవరికి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

News March 20, 2024

కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి

image

కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కర్లపూడి గ్రామానికి చెందిన అభిషేక్ (17) పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్నానానికి వైకుంఠపురం పుష్కరఘాట్‌కు వచ్చి నీట మునిగి చనిపోయాడు.

News March 20, 2024

వట్టిచెరుకూరు: కోడ్ పాటించని ఆటోపై కేసు నమోదు

image

వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నర‌కు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.

News March 20, 2024

నరసరావుపేట టీడీపీ టికెట్‌పై రగడ

image

నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

News March 20, 2024

గుంటూరుకి చేరిన CRPF బలగాలు

image

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650 మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.

News March 20, 2024

గుంటూరు పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ ఏర్పాటు

image

సుప్రీమ్ కోర్ట్ 2006లో ప్రకాష్ సింగ్ కేసు తీర్పులో జారీ చేసిన మార్గదర్శక సూత్రాలననుసరించి, పోలీస్‌లపై వచ్చే ఫిర్యాదులను విచారించడానికి “పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థలను” రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేసినట్లు మంగళవారం అధికారి తెలిపారు.

error: Content is protected !!