Guntur

News March 27, 2024

ANU: ‘డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి’

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగవలసిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. రాజశేఖర్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. లక్ష్మణరావుతోపాటు అధ్యాపక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలబస్ పూర్తికాని దృష్ట్యా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 27, 2024

క్రోసూరు: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

image

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని చిలకా చిన్నారి (15) మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. క్రోసూరు మండలం నాగవరాని చెందిన విద్యార్థిని స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో పది పరీక్షలు రాస్తోంది. బుధవారం సైన్సు పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది. విద్యార్థినికి కొన్నాళ్లుగా గుండె సమస్య ఉన్నట్లు సమాచారం. 

News March 27, 2024

బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్

image

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్ అవార్డు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్ బెస్ట్ పోలీసింగ్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అవార్డును అందించనున్నారు.

News March 27, 2024

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా అజయ్ 

image

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గుంటూరులోని CPI కార్యాలయంలో కూటమి సభ్యులు సమావేశం నిర్వహించి అజయ్ కుమార్‌ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మిక, రైతు, పేద, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

News March 27, 2024

కొల్లిపర: పురుగుమందు తాగిన దంపతులు.. భర్త మృతి

image

కొల్లిపర మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తూములూరుకు  చెందిన చంద్రశేఖర్ (45), నాగలక్ష్మీ (35) దంపతులు ఆర్థిక సమస్యలతో మంగళవారం పురుగుమందు తాగారు. చంద్రశేఖర్ మృతి చెందగా, నాగలక్ష్మి చికిత్స పొందుతోంది. వీరిది దుగ్గిరాల మండలం ఈమని. డ్రైవరుగా పనిచేసే చంద్రశేఖర్‌ గతేడాది ప్రమాదం బారిన పడి ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

గుంటూరు: నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇ‌న్‌ఛార్జ్‌ల నియామకం

image

గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను నియమించింది. సత్తెనపల్లి, చిలకలూరిపేట, వేమూరులకు మోదుగుల వేణుగోపాల్‌ను.. రేపల్లెకు ఎలక్షన్ అబ్జర్వర్‌గా గాదె మధుసూదన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

News March 27, 2024

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా సమగ్ర ప్రణాళిక: కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగునీటి అవసరాల కొరకు ఏప్రిల్ 8వ తేదీన సాగర్ నీరు విడుదల కానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. విడుదలయ్యే నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు.

News March 26, 2024

అందరితో సంప్రదించాకే నిర్ణయం: ఎమ్మెల్సీ జంగా

image

అందరితో సంప్రదించిన తర్వాతే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గంలో అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సలహాలను, సూచనలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.

News March 26, 2024

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుషార్

image

ఎన్నికలవేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఓటర్ కార్డ్ ఆన్లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ఫోన్‌కు లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు.

News March 26, 2024

REWIND: గుంటూరులో గల్లా జయదేవ్‌దే అత్యల్పం

image

గుంటూరు లోక్‌సభ నుంచి మహామహులు ఎన్నికయ్యారు. ఎన్జీ రంగా, లాల్ జాన్ బాషా, కొత్త రఘురామయ్య, రాయపాటి జయకేతనం ఎగురవేశారు. గత 2 పర్యాయాలు గల్లా జయదేవ్ ఇక్కడ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 69,111 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. 2019లో కేవలం 4,205 ఓట్లతో గట్టెక్కారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇదే అత్యల్పం. ఈ ఎన్నికల్లో TDP కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, YCP నుంచి కిలారు రోశయ్య బరిలో దిగుతున్నారు.