Guntur

News May 26, 2024

మాచర్ల: మహిళపై విచక్షణారహితంగా కత్తితో దాడి

image

మాచర్ల పట్టణంలో మహిళపై ఆదివారం ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. 22వ వార్డుకు చెందిన నీలావతి అనే మహిళపై వెంకటేశ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడని బాధితురాలి బంధువులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి వీధుల్లో కత్తితో వీరంగం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

News May 26, 2024

గుంటూరు: పాఠశాలకని వెళ్లి తిరిగిరాని విద్యార్థి

image

బడికి వెళ్లిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంపాలెంకు చెందిన బాలుడు పదవ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. సబ్జెక్ట్స్ సప్లిమెంటరీ రాయడానికి సిద్ధమవ్వాలని పాఠశాల మాస్టర్ దగ్గరికి వెళుతున్నానని చెప్పి శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని అండ్రి అన్నారు.

News May 25, 2024

చిలకలూరిపేట: ఓగేరు వాగులో పడి ఇద్దరు మృతి

image

చిలకలూరిపేట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మద్దిరాల గ్రామంలోని ఓగేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గ్రామానికి చెందిన పరిచూరి శ్రీనివాసరావు(50), వరగాని వెంకట్రావు(40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

image

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19,027 ఓట్లు నమోదు అయ్యాయి. ఒక్కో టేబుల్‌కు 1,058 ఓట్ల చొప్పున 18 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు.

News May 25, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం

image

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19027 ఓట్లు నమోదు కాగా.. ఒక్కో టేబుల్‌కు 1058 ఓట్ల చొప్పున 18 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు.

News May 25, 2024

వినుకొండ: గుండెపోటుతో వీఆర్వో మృతి

image

గుండె పోటుకు గురై VRO మృతి చెందిన ఘటన వినుకొండ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న యేసు రత్నం, స్వగ్రామమైన పానకాలపాలెంలో శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. యేసు రత్నంకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News May 25, 2024

గుంటూరు: పొలాల్లో యువతి మృతదేహం కలకలం

image

గుంటూరు సమీపంలోని పొలాల్లో ఒక యువతి దేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద పొలాల్లో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె నోటి వెంట నురగతో పాటు రక్తం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 25, 2024

గుంటూరు: అడల్ట్ BCG వ్యాక్సిన్‌కు 1.77 లక్షల మంది సమ్మతి

image

అడల్ట్ BCG వ్యాక్సిన్ వేయించుకోవటానికి గుంటూరు జిల్లాలో 1.77లక్షల మంది వారి సమ్మతి తెలియజేశారని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 12 జిల్లాలను కేస్ స్టడీ కింద ఎంపిక చేశారని, వాటిల్లో గుంటూరు జిల్లా కూడా ఒకటని తెలిపారు. కావున జిల్లాలో వ్యాక్సిన్ కోసం సమ్మతి తెలియజేసిన వారికి ప్రతి గురువారం వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వ్యాక్సిన్ వేస్తారన్నారు.

News May 25, 2024

గుంటూరు: పలు రైళ్లు 30 రోజులు రద్దు

image

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు-డోన్ (17228), హుబ్లీ-విజయవాడ (17329), కాచిగూడ- నడికుడి- కాచిగూడ (07791/07792) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి జులై 1వ తేదీ వరకు డోన్-గుంటూరు (17227), జూన్ 2 నుంచి జులై 1వ తేదీ వరకు విజయవాడ-హుబ్లీ(17330) రైళ్లు నడవవని పేర్కొన్నారు.

News May 25, 2024

పచ్చటి పల్నాడు పల్లెల్లో రాజకీయ కార్చిచ్చు

image

పాడి పంటలతో కళకళలాడే పచ్చటి పల్నాడు జిల్లాలో రాజకీయ కార్చిచ్చుకు ఆహుతై పోతున్నాయి. కులమతాలకు అతీతంగా ఉండే ఆత్మీయులే ఎన్నికల సమయానికి బద్ధ శత్రువులుగా మారుతున్నారు. క్షణికావేశంలో జరిగే దాడులతో పురుషులు జైళ్ళపాలు అవుతుంటే.. మహిళలు వ్యవసాయ కూలీలవుతున్నారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు.