India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ తెనాలి మార్కెట్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ సుమారు 6 గంటలకు బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు తొలి స్పీకర్లను అందించింది. మద్రాసు నుంచి ఏపీ విడిపోయిన తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా నరసరావుపేటకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారు. అదేవిధంగా 2014లో తెలంగాణ, ఆంధ్రా విడిపోయిన నేపథ్యంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు.
బాపట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జేడీ శీలం పోటీ చేయనున్నారు. పెదనందిపాడు మండలం పూసులూరులో జన్మించిన జేసుదాసు శీలం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఏంఎస్సి పూర్తి చేశారు. 1984-99 మధ్య IAS అధికారిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసి ఓటపోయారు. 2004 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు జరిపిన తనిఖీలలో మంగళగిరి పరిధిలో 19.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ పరిధిలో రూ.1,24,350 నగదు, గుంటూరు తూర్పు పరిధిలో రూ.1,75,000 నగదు సీజ్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,84,77,900ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెలగపూడి సచివాలయంలో గత నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి మాట్లాడినట్లు, టీడీపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా తుళ్ళూరు సీఐ సుభాని సెక్షన్ 188, 171F కింద కేసు నమోదు చేశారు.
మొబైల్‌లు, బయోమెట్రిక్ డివైజ్‌లు పోగొట్టుకుంటే వాలంటీర్లు కొత్త IRIS, బయోమెట్రిక్ డివైజ్‌ను కొనుగోలు చేసి సంబంధిత సెక్రటరీకి అప్పగించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఏదైనా నష్టం, మొబైల్‌కు డ్యామేజ్ జరిగితే వాలంటీర్లు రూ.8 వేలు చెల్లిస్తే కొత్త మొబైల్ అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సూచనలను పాటించాలని ఆదేశించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * పెదకూరపాడు: పామిడి నాగేశ్వరరావు * తాడికొండ: చిలకా విజయ్ కుమార్ * పొన్నూరు: జక్కా రవీంద్రనాథ్ * వేమూరు: బురగ సుబ్బారావు * ప్రత్తిపాడు: వినయ కుమార్ * గుంటూరు ఈస్ట్: షేక్ మస్తాన్ వలి * చిలకలూరిపేట: మద్దుల రాధా కృష్ణ * నరసరావుపేట: షేక్ మహబూబ్ బాషా * వినుకొండ: చెన్న శ్రీనివాసరావు * గురజాల: యలమంద రెడ్డి * మాచర్ల: రామచంద్రా రెడ్డి
పిట్టలవానిపాలెం మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఖాజీపాలెం గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీలో పాము కాటుకు గురై 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మండల వ్యాప్తంగా సుమారు 30 మంది వాలంటీర్లు తమ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. మండల వ్యాప్తంగా సోమవారం పొడపాడు, హుస్సేనగరం, ముసాపురం, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లోని వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటరీ పోస్ట్‌లకు రాజీనామా తెలిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలక్షన్ల సమయంలో అవ్వ తాతలకు అందించలేకపోయామనే బాధతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.