India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నెల 14 మధ్యాహ్నం వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు తీసుకొచ్చామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. సీవిజిల్‌లో వచ్చే ఫిర్యాదుల ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేశాం. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వంద శాతం ఓట్లు పోల్ అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బాపట్ల జిల్లా పరిధిలోని చిన్నగంజాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. చీరాల ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. మృతులు బాపట్ల పట్టణంలోని ఆరో వార్డు వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గుంటూరు జిల్లాలో ఈనెల 13వ తేదీ జరుగుతున్న పోలింగ్‌కు జిల్లాలో 1498 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో ఎస్పీ తుషార్‌తో కలిసి మాట్లాడారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి బస్సుకు జిపిఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదన్నారు.

ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు కాచిగూడ- గుంటూరు, కాచిగూడ-రేపల్లె, 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రేపల్లె-సికింద్రాబాద్ రైళ్లకు అదనపు బోగీలు ఉంటాయన్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్-రేపల్లె రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును, గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. నేడు సికింద్రాబాద్‌లో 19.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు సత్తెనపల్లి, గుంటూరు, విశాఖపట్నం 06.30 గంటలకు చేరుతుందన్నారు. అయితే పలు రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రముఖ సినీ <<13231508>>రచయిత కోన వెంకట్ పై<<>> కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. శనివారం కర్లపాలెం మండలంకు చెందిన ఓ రాజకీయ కార్యకర్తపై దాడి చేశారన్న ఆరోపణతో ఆయనతోపాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశామన్నారు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఘటనకు పరోక్షంగా కారణమైన ఎస్సై పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

కర్లపాలెం <<13230471>>ఎస్సై జనార్దన్‌ను సస్పెండ్<<>> చేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడి విషయంలో ఘటనకు ఎస్సై పరోక్షంగా కారణమయ్యాడనే నెపంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలీస్ సిబ్బంది ప్రవర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.